ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్..!!

ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి( CM Arvind Kejriwal ) గురువారం బెయిల్ లభించింది.లక్ష రూపాయలు పూచికత్తుతో ఆయనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) బెయిల్ మంజూరు చేయడం జరిగింది.

 Bail To Delhi Chief Minister Kejriwal Details, Cm Kejriwal, Delhi Liquor Scam Ca-TeluguStop.com

దీంతో సీఎం కేజ్రీవాల్ శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.లిక్కర్ స్కామ్ కేసులో ఆయన లంచం తీసుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేజ్రీవాల్ పై చార్జిషీట్ దాఖలు చేయటం తెలిసిందే.

ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయి దాదాపు మూడు నెలలు కావస్తోంది.ఈ క్రమంలో అనేక మార్లు బెయిల్ ( Bail ) కోసం న్యాయస్థానంలో పోరాడగా మధ్యలో తాత్కాలిక బెయిల్ రావడం జరిగింది.ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసే ప్రాంతాలలో కేజ్రీవాల్ తనదైన శైలిలో ప్రచారం చేయటం జరిగింది.ఆ తర్వాత బెయిల్ గడువు ముగియడంతో.

సరెండర్ అయ్యారు.కాగా మళ్లీ బెయిల్ కోసం న్యాయస్థానంలో పోరాడగా.

ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కేజ్రీవాల్ కి బెయిల్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రేపు తీహార్ జైలు నుండి విడుదల కాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube