ఏపీలో స్టూడియోల నిర్మాణంపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ పర్యాటక.సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్( Minister Kandula Durgesh ) గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Key Comments Of Minister Kandula Durgesh On Construction Of Studios In Ap Detail-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రకృతి వనరులు కలిగిన రాష్ట్రమని పేర్కొన్నారు.ఎకో, టెంపుల్, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని అధికార యంత్రాంగంతో కలిసి అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

పర్యాటక ప్రాంతాలుగా( Tourist Places ) విరజిల్లాల్సిన ప్రాంతాలను గత ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.అదృష్టవశాత్తు రాష్ట్ర ప్రజానీకం వైకాపాకి గట్టిగా బుద్ధి చెప్పారని పర్యాటక రంగాన్ని ఉపయోగించుకుని నిధులు సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు.

సినిమా షూటింగులకు( Movie Shootings ) అనుగుణంగా కోనసీమ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.సినిమా షూటింగులు పెరిగేలా చర్యలు తీసుకుంటాం.ఏపీలో స్టూడియోల నిర్మాణం( Studios ) కోసం ముందుకు రావాలని నిర్మాతలకు ఆహ్వానం పలికాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేయడం జరిగింది.

కందుల దుర్గేష్ నేడు సాయంత్రం 5:50 నిమిషాలకు వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయం రెండో బ్లాక్ లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ₹2.31 కోట్ల అంచనా వ్యాయాయంతో పది టూరిజం బోట్లను కొనుగోలు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube