భర్తను చంపిన భార్య... 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు...!

సూర్యాపేట జిల్లా: భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి భర్తను విచక్షణారహితంగా కొట్టి చంపిన కేసును పోలీసులు మూడు రోజుల్లో ఛేదించి,12 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి సంఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది.హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు గురువారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం…గత సోమవారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం మూసిఒడ్డు సింగారం గ్రామానికి చెందిన ఆరుట్ల చిరంజీవి(41) 2009లో గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన రాయి అరుణను ప్రేమ వివాహం చేసుకున్నాడు.

 Wife Who Killed Her Husband Police Arrested 12 People, Wife Killed Husband, Poli-TeluguStop.com

గత కరోనా లాక్ డౌన్ నుండి చిరంజీవి ఏ పనికి వెళ్లకపోవడంతో అరుణ ప్రైవేట్ స్కూల్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.

ఆమెపై అనుమానం పెంచుకున్న భర్త చిరంజీవి ఆమెను వేధిస్తూ స్కూల్ మాన్పించి గొడవ పడుతూ అండగా పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చారు.

అయినా భర్త వేధింపులు ఆపకపోవడంతో భర్త పెట్టే బాధలు భరించలేక భార్య అరుణ ఇద్దరు పిల్లలతో గుడుగుంట్లపాలెం గ్రామంలోని తన తల్లగారింటికి వెళ్ళి,గత రెండు నెలలుగా అక్కడే ఉంటుంది.ఈనెల 17 రాత్రి 1.30 గంటల సమయంలో చిరంజీవి అత్తవారింటికి వెళ్ళి అరుణ మెడపై కత్తి పెట్టి చంపుతానని బెదిరించగా ఆమె కేకలు వేయడంతో అరుణ తల్లి,బాబాయిలు, చిన్నమ్మలు చిరంజీవిని తాడుతో కాళ్ళు చేతులు కట్టేసి కర్రలు,రాళ్ళు మరియు చేతులతో విచక్షణారహితంగా కొట్టి చంపారు.

మృతిని అన్న నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్య అరుణ మరియు ఆమె బంధువులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

అరుణ మరియు ఆమె బంధువులను అదుపులోకి తీసుకుని విచారించగా చిరంజీవిని కొట్టి చంపిన విషయం ఒప్పుకోవడంతో హత్య కేసులో నిందితులైన మృతుని భార్య అరుణ,ఆమె బంధువులు పెద్ద బాబాయి రాయి జయరాజ్,రెండో బాబాయి రాయి ప్రతాప్, జయరాజ్ కొడుకు రాయి రవి, ప్రతాప్ కొడుకు రాయి చిన్న గోపి,అరుణ తల్లి రాయి శాంతమ్మ,జయరాజు భార్య లక్ష్మమ్మ, ప్రతాప్ భార్య రాయి ప్రమీల,గోపి భార్య రాయి సుజాత,సుజాత తల్లి నూకబత్తిని బుచ్చమ్మ, శాంతమ్మ కోడలు రాయి భవాని,దగ్గరి బంధువు కలుకూరి వెంకన్నలను అరెస్టు చేసి గురువారం జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube