యూజర్ల కోసం బ్లూ టిక్ ను మళ్లీ తీసుకొస్తున్నట్లు ట్విట్టర్ కీలక ప్రకటన చేసింది.ఈనెల 29 న బ్లూ టిక్ చందాను అందుబాటులోకి తీసుకురానున్నారు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత బ్లూ టిక్ చార్జీలను పెంచిన విషయం తెలిసిందే.ఛార్జీల పెంపుతో సెలబ్రెటీల పేర్లతో ఖాతాలు తెరిచే వారి సంఖ్య పెరిగిపోయినట్లు తెలుస్తోంది.
బ్లూ టిక్ చందాకు దరఖాస్తు చేసుకుని సెలబ్రెటీల పేరుతో ఖాతాలను తెరుస్తున్నారు.దీంతో ట్విట్టర్ తాత్కాలికంగా బ్లూ టిక్ సేవలను నిలిపివేసింది.
నకిలీల బెడదను తట్టుకునే విధంగా మార్పులు చేస్తూ తిరిగి ఈనెల 29న బ్లూ టిక్‌ను రీలాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.