చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాబోతున్న రజనీకాంత్..!!

రేపు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కేసరిపల్లిలోని ఐటీ టవర్ వద్ద రేపు ఉదయం 11:27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ( PM Modi ) కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, బండి సంజయ్, మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు.ప్రమాణ స్వీకారానికి వివిఐపీలు వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగింది.

 Rajinikanth Coming To Chandrababu Oath Taking Ceremony Details, Rajinikanth, Ch-TeluguStop.com

విజయవాడ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.ఇక ఇదే కార్యక్రమానికి తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) కూడా హాజరు కాబోతున్నారు.

ఆయన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని చంద్రబాబు పిలుపునివ్వడం జరిగింది.

రాష్ట్ర నలుమూలల నుండి దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి 7,000 మందితో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.నగరంలో ప్రముఖులు బస చేసే హోటల్లో వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది.

ఇదిలా ఉంటే రేపు డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఏపీలో జరిగిన ఎన్నికలలో చారిత్రాత్మకమైన విజయం సాధించటంతో.

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూటమి నాయకులు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.తెలుగు రాజకీయాలలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తూ చంద్రబాబు సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube