ప్రతి వారం థియేటర్లు, ఓటీటీలలో క్రేజీ సినిమాలు విడుదలవుతూ ఉంటాయి.అయితే ప్రతి వారం 10 సినిమాలు రిలీజైతే ఆ సినిమాల్లో కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే హిట్ అవుతూ ఉంటాయి.
మరోవైపు ఓటీటీలలో రిలీజవుతున్న సినిమాలలో కొన్ని సినిమాలు హిట్టవుతూ నిర్మాతలకు, ఓటీటీ నిర్వాహకులకు మంచి లాభాలను అందిస్తున్నాయి.ఎన్నికలు, ఐపీఎల్ వల్ల ఇన్నిరోజులు చిన్న సినిమాలే విడుదలయ్యాయి.
ఈ వారం నుంచి మాత్రం థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి.విజయ్ సేతుపతి మహారాజ సినిమా( Maharaja ) ఈ నెల 14వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
సుధీర్ బాబు హీరోగా పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన హరోం హర( Harom Hara ) సైతం ఈ నెల 14వ తేదీన విడుదల కానుండటం గమనార్హం.యశ్ పాత సినిమా రాజధాని రౌడీ( Rajadhani Rowdy ) పేరుతో ఈ నెల 14వ తేదిన రిలీజ్ కానుంది.
సూపర్ ఉమెన్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఇంద్రాణి( Indrani ) సైతం అదే తేదీన విడుదల కానుందని తెలుస్తోంది.చాందిని చౌదరి నటించిన యేవమ్,( Yevam ) మ్యూజిక్ షాప్ మూర్తి( Music Shop Murthy ) సినిమాలు సైతం అదే తేదీన విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది.ఓటీటీల విషయానికి వస్తే ఈ నెల 14న నెట్ ఫ్లిక్స్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs Of Godavari ) స్ట్రీమింగ్ కానుంది.ఈ నెల 12న మిస్టరీస్ ఆఫ్ ది టెరికోట వారియర్స్, 13న బ్రిడ్జ్ టన్ వెబ్ సిరీస్, 14న మహరాజ్ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కానున్నాయి.
ఈ నెల 13న అమెజాన్ ప్రైమ్ లో ది బాయ్స్ 4( The Boys 4 ) వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.జూన్ 14వ తేదీన జీ5 యాప్ లో పరువు తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది.అదే తేదీన జీ5 లో లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.హాట్ స్టార్ లో ఈ నెల 10వ తేదీన ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుండగా నాట్ డెడ్ యెట్ వెబ్ సిరీస్ ఈ నెల 12న స్ట్రీమింగ్ కానుంది.
ఆహా ఓటీటీలో పారిజాత పర్వం తెలుగు వెర్షన్ జూన్ నెల 12వ తేదీన స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది.బుక్ మై షోలో ఈ నెల 14న ది ఫాల్ గై హాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా జూన్ 11న జియో సినిమాలో గాంత్ హిందీ స్ట్రీమింగ్ కానుంది.ఆపిల్ టీవీ ప్లస్ లో ఈ నెల 12వ తేదీన ప్రిజ్యూమ్డ్ ఇన్నోసెంట్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం.