ఒడిశాలో( Odisha ) 24 ఏళ్ల నుండి గెలుస్తున్న బీజేడి( BJD ) ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి పాలయ్యింది.భారతీయ జనతా పార్టీ ఊహించని రీతిలో అధికారాన్ని కైవసం చేసుకుంది.
దీంతో ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ( Odisha CM Mohan Charan Majhi ) పేరును బీజేపీ ఖరారు చేసింది.ఈ ఎన్నికలలో మోహన్ చరణ్ కీయోంజర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 87 వేల పై చిలుకు మెజారిటీతో గెలవడం జరిగింది.
ఒడిశా 15వ సీఎంగా ఎన్నికైన 53 ఏళ్ల మోహన్ చరణ్ మాఝి ఆదివాసీ నేత.ఆయన కియోంజర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోహన్ కూ ఏకంగా 47.05 శాతం ఓట్లు రావడం గమనార్హం.మోహన్ ప్రజాసేవతో మంచి గుర్తింపు పొందారు.ఒడిశా రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గాను పేరొందారు.గత ఏడాది నిరసనలో భాగంగా అసెంబ్లీలో స్పీకర్ పోడియం వైపు పప్పు విసిరి సస్పెన్షన్ కు గురవ్వడంతో మోహన్ పేరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.ఒడిశాలో మొదటిసారి బీజేపీ( BJP ) అధికారంలోకి వచ్చింది.
గతంలో దాదాపు 20 సంవత్సరాలు క్రితం బీజేపీ.బీజేడీ పొత్తులు పెట్టుకుని 2000 నుంచి 2004 వరకు ప్రభుత్వం కొనసాగించడం జరిగింది.
కానీ ఆ తర్వాత బీజేడి ఒంటరిగా గెలుస్తూ ఉంది.కానీ దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ గెలిచి సంచలనం సృష్టించింది.