ఆర్ఆర్‌ఆర్‌ : సాయంత్రం పోయి రాత్రి అవుతుంది.. ఎక్కడ బాసూ అప్‌డేట్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ ముగించుకుంది.ఇప్పటికే ఒక పాట విడుదల అయ్యింది.

 Rajamouli Rrr Movie Second Song Update, Rajamouli,rrr Movie, Rrr Movie Second So-TeluguStop.com

జనవరిలో సంక్రాంతి కానుకగా సంక్రాంతి కంటే వారం రోజుల ముందుగానే ఆర్ ఆర్ ఆర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు సంగీతాన్ని కీరవాణి అందిస్తున్నారు.

నిన్న దీపావళి సందర్బంగా సినిమా రెండవ పాటను రేపు అంటే నేడు సాయంత్ర అప్ డేట్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.రెండవ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూసిన అభిమానులు నిన్నటి ప్రకటనతో ఆనందంతో ఉన్నారు.

అయితే నేడు సాయంత్రం కోసం ఉదయం నుండి వెయిట్‌ చేసిన అభిమానులు ఉసూరుమంటున్నారు.

Telugu Diwali, Neelambari, Netizens, Rajamouli, Rajamouli Rrr, Ram Charan, Rrr-M

అదుగో ఇదుగో అంటూ అభిమానులు సోషల్‌ మీడియా లో ఆర్ ఆర్ ఆర్‌ రెండవ పాట అప్ డేట్‌ గురించి చర్చించుకుంటూ వచ్చారు.సాయంత్రం పోయి రాత్రి కూడా అయ్యింది.కాని పాటకు సంబంధించిన అప్‌ డేట్ ఇవ్వక పోవడంతో అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

అసలు చిత్ర యూనిట్‌ సభ్యులు ఏం చేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.చిన్న సినిమాల మాదిరిగానే జక్కన్న కూడా ఇచ్చిన మాట ప్రకారం సినిమాకు సంబంధించిన అప్ డేట్‌ ఇవ్వక పోవడం ఏంటీ అంటూ కొందరు విమర్శలు చేస్తుంటే మరి కొందరు మాత్రం జక్కన్న ఏం చేసినా అందుకు ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది.

అందుకే ఆలస్యం అయినా కూడా అద్బుతం రాబోతుంది అంటూ నెటిజన్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు.టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి నుండి రాబోతున్న పాట కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా అయిదు భాషల్లో రావాల్సి ఉంది.

అందుకే కాస్త ఆలస్యం అవ్వడం.టెక్నికల్‌ ఇష్యూలు అవ్వడం జరుగుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube