చాలా సినిమాలు వస్తుంటాయి.పోతుంటాయి.
కొన్ని సినిమాలు మాత్రమే అలా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంటాయి.అలా నిలిచిపోయే సినిమాగా తమ సినిమా ఉండాలని ప్రతీ మూవీ మేకర్ అనుకుంటాడు.
కాగా, బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ చేసిన సినిమాలు కొన్ని జనాల మదిలో ఉండిపోతాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఆ కోవకు చెందిన ఫిల్మ్ ‘లమ్హే’.
బాలీవుడ్ టు హాలీవుడ్ సత్తా చాటిన నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న అనిల్ కపూర్.‘లమ్హే’ సినిమా కోసం చాలా కష్టాలు పడ్డాడట.
ఆ విషయాలను అనిల్ కపూర్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం గమనార్హం.ఈ చిత్రంలో అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించారు.
వీరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా చిత్రాలు సూపర్ హిట్ కాగా, ఈ సినిమా చాలా ప్రత్యేకమని అనిల్ కపూర్ వివరించాడు.‘లమ్హే’ మూవీ విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనిల్ కపూర్ ఆ కష్టాల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
బాక్సాఫీసును బద్దలు కొట్టి బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన ‘లమ్హే’ చిత్రం కోసం తాను పడరాని పాట్లు పడ్డానని అన్నాడు.‘లమ్హే’ సినిమాకు యశ్ చోప్రా ప్రొడ్యూసర్.
కాగా, ఆ చిత్ర షూటింగ్ కోసం లండన్‌కు వెళ్లిన క్రమంలో తాము లండన్‌కు రీచ్ అయ్యాక.శ్రీదేవి ఫాదర్ చనిపోయాడని తెలిసిందని పేర్కొన్నాడు.
దాంతో శ్రీదేవి ఇండియాలోనే ఉండిపోయింది.
![Telugu Anil Kapoor, Lamhe, Sridevi-Movie Telugu Anil Kapoor, Lamhe, Sridevi-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/11/Anil-Kapoor-Lamhe-30-Years.jpg)
ఆ టైంలోనే తాను రెండు సినిమాలు చేయాల్సి ఉందని, అయితే, అప్పుడు హోటల్ బిల్స్ చాలా ఎక్కువగా ఉండేవని, ఈ నేపథ్యంలోనే తాను ఇండియాకు వెళ్లి తిరిగొచ్చే పరిస్థితి లేక 20రోజులు లండన్‌లోనే ఉండిపోయానని పేర్కొన్నాడు అనిల్ కపూర్. యశో చోప్రా రిక్వెస్ట్ మేరకు అలా చేయాల్సి వచ్చిందని, అయితే, అలా చేయడం వల్ల తన సొంత బ్యానర్‌లో చేసిన సినిమా, ఇంకో సినిమాకు భారీ నష్టం వచ్చిందని చెప్పాడు.ఇకపోతే ఆ సమయంలో లండన్‌లో హోటల్ బిల్స్ ఎక్కువగా ఉండటం వల్ల యశ్ చోప్రా స్నేహితుడి ఇంట్లో ఉండాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నాడు.
శ్రీదేవి లండన్‌కు వచ్చిన తర్వాత యాజ్ యూజ్యువల్‌గా షూటింగ్ జరిగిందని, ఆ తర్వాత తాను ఇండియాకు వచ్చానని అనిల్ కపూర్ వివరించాడు.మొత్తానికి ‘లమ్హే’ సినిమా తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమాని అనిల్ కపూర్ చెప్పుకొచ్చాడు.