వంగవీటి రంగ హత్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ !

గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది వంగవీటి రాధాకృష్ణ వ్యవహారం.ఆయన వైసీపీకి ఇటీవలే రాజీనామా చేశారు.

 Radhakrishna Sensational Comments On The Murder Of Vangaveeti Ranga-TeluguStop.com

త్వరలోనే టీడీపీ గూటికి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన రాధా అనేక విషయాల గురించి వెల్లడించాడు.

తాను వైసీపీలో ఎన్నో అవమానాలను భరించానని, అందుకే పార్టీకి రాజీనామా చేశానని వంగవీటి రాధాకృష్ణ వివరించాడు.‘పార్టీలో చేరేటప్పుడు.

తమ్ముడిలా చూసుకుంటానని చెప్పి జగన్‌ మోసం చేశారు.నీ తండ్రి మీద జాలిచూపించి పార్టీలో ఉండనిచ్చా అని పదేపదే అనేవాడు.

నేను వదిలిస్తే గాలికి పోతావని అని కూడా అనేవాడు’ అని వంగవీటి అన్నారు.ఇప్పటికైనా జగన్‌రెడ్డి పద్దతి మార్చుకొని తన అభిమానులను గౌరవించాలని, తనకు జరిగిన అవమానాలు మరొకరికి జరగకూడదని హెచ్చరించారు.

తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదని రాధాకృష్ణ స్పష్టం చేశారు.

అలాగే రంగా హత్య గురించి మాట్లాడుతూ… రంగా హత్య కొందరు వ్యక్తుల పని అని, దానిని టీడీపీకి ఆపాదించడం సరికాదన్నారు.రంగాను అభిమానించేవాళ్లు అన్ని పార్టీల్లో ఉన్నారని వంగవీటి పేర్కొన్నారు.ఇక సోషల్‌మీడియా ద్వారా వైసీపీ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనను చంపేస్తామంటున్నారని వంగవీటి తెలిపారు.

‘నా ప్రాణం కంటే నా తండ్రి ఆశయసాధనే ముఖ్యం.పేద ప్రజల కోసం నా తండ్రి పోరాటం చేశారు’ అని అన్నారు.

సోషల్‌మీడియా దాడులకు భయపడి పారిపోనన్నారు.‘నేను మీతో కలిసే పనిచేద్దామనుకున్నా.

మీరు మాత్రం సర్వం నేనే.అందరూ నాకింద పనిచేయాలన్నట్టు ప్రవర్తించారు’ అని వంగవీటి అసహనం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube