నిన్న కాంగ్రెస్ కీలక నేత ఎఐసిసి జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) తెలంగాణకు విచ్చేశారు. సరూర్ నగర్ లో కాంగ్రెస్( Congress Party ) ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంఘర్షణ( Yuva Sangharshana ) సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .
ఈ సందర్భంగా భారీగా జన సమీకరణ చేపట్టారు.ఊహించని రీతిలో జనాలు సభకు హాజరు కావడంతో ప్రియాంక గాంధీ సైతం ఉత్సాహంగా సభలో ప్రసంగించారు.ఈ సందర్భంగా తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి గుర్తుకు తెచ్చి , ప్రజల్లో కాంగ్రెస్ పై ఆదరణ పెంచే విధంగా ప్రియాంక ప్రసంగించారు.’ తెలంగాణ ఇది కేవలం పటంలోని ప్రాంతం మాత్రమే కాదు.ఇక్కడ ప్రజలకు ఈ నేల అమ్మతో సమానం .రాష్ట్ర సాధన కోసం శ్రీకాంతాచారి లాంటి ఎంతో మంది యువత ప్రాణత్యాగం చేశారు.అయితే అమరవీరులు ఏ ఆకాంక్షలు, లక్షల కోసం ఉద్యమంలో చేరి ప్రాణాలు అర్పించారో అవి నెరవేరలేదు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం యువత ఉద్యమించాలి.
యువత బలిదానాలు వల్లే తెలంగాణ సాధ్యమైంది.రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం చాలా కఠినమైనది.
దీనికోసం సోనియా ఎంతో మదనపడ్డారు .ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే తపన సోనియాకి ఉంది.మీ ఆకాంక్షలు నెరవేరాలని ఆమె రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపారు .ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి అని భావించినా, అలా జరగలేదు ‘ అంటూ ప్రియాంక ప్రసంగించారు.ఈ సందర్భంగా యూత్ డిక్లరేషన్ ను( Youth Declaration ) తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.యూత్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
రాబోయే ఎన్నికల్లో గెలుపునకు ఇదే మార్గం అని భావిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం, తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన ఉద్యమకారులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు 25 గౌరవ పింఛన్ అందించడం.అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాలు కల్పించడం, ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం.ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి ఏటా జూన్ 2 నాటికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్లు అందించడం, సెప్టెంబర్ 17న నియామక పత్రాలు ఇవ్వడం, ఉద్యోగ ప్రయత్నాలు చేసి నిరుద్యోగులుగా మిగిలిపోయిన యువకులకు 4 వేలు నిరుద్యోగ భృతి కల్పించడం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను బలోపేతం చేసి యూపీఎస్సీ తరహాలో నియామక పరీక్షలు నిర్వహించడం,
నిరుద్యోగ రైతు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయడం , ఏడు జోన్లుగా విభజించిన రాష్ట్రంలో ఎంప్లాయిమెంట్ ఎక్సేంజీలు ఏర్పాటు చేయడం, ప్రైవేటు పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానిక నిరుద్యోగ యువకులకు ఇచ్చేలా చట్టం తీసుకురావడం, నిరుద్యోగ యువతకు అండగా యూత్ కమిషన్ ఏర్పాటు, చేసి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించడం, ఎస్సీ, ఎస్టీ , బీసీ , మైనారిటీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా, పూర్తిస్థాయిలో చెల్లించడం,
తెలంగాణ పాలమూరు మహాత్మా గాంధీ శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడం, బాసర ట్రిపుల్ ఐటీ తరహాలో రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేయడం, అమెరికాలో ఉండే ఐఎంజీ తరహాలో స్పోర్ట్స్ అకాడమీ తెలంగాణలో ఏర్పాటు చేసి , క్రీడా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం, ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది , ఆర్టీసీ కార్మికుల పిల్లల కోసం వరంగల్ హైదరాబాద్ లో ప్రత్యేక యూనివర్సిటీలు నిర్మించి ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించడం వంటి హామీలతో యూత్ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రవేశపెట్టింది.