యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ”సలార్”( Salaar ) ఒకటి.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel) తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.
మరి రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురు చూసారు.అందులోను టీజర్ రిలీజ్ చేసి అంచనాలు మరిన్ని పెంచేశారు.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ నెక్స్ట్ ఏ అప్డేట్ వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో షాకింగ్ న్యూస్ వైరల్ అయ్యింది.
సెప్టెంబర్ నెల స్టార్ట్ అయినా ఈ సినిమా నుండి ట్రైలర్ కానీ మరొక అప్డేట్ కానీ రిలీజ్ చేయలేదు.
దీంతో ఫ్యాన్స్ ముందు నుండి ఎక్కడ వాయిదా అని చెబుతారో అని బయపడగా అదే న్యూస్ రావడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఈ నెల మాత్రం రిలీజ్ అవ్వడం లేదు అని తేలిపోయింది.దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుందట.
ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండడం వల్లనే వాయిదా పడినట్టు తెలుస్తుంది.
మరి ఇప్పుడు ఈ వర్క్ శరవేగంగా జరుగుతుందట.ఇప్పటికే డబ్బింగ్ వర్క్ షురూ చేయగా తెలుగు, కన్నడ భాషల్లో డబ్బింగ్ స్టార్ట్ అయ్యింది.ప్రభాస్ కూడా డబ్బింగ్ వర్క్ లో పాల్గొని తన పార్ట్ డబ్బింగ్ పూర్తి చేస్తున్నాడట.
ఇక ఈ వర్క్ అంతా పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు అని తెలుస్తుంది.చూడాలి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో.