టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ప్రభాస్ ( Prabhas ) ఒకరు.యంగ్ రెబెల్ స్టార్ గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం హీరోగా మారిపోయారు.
ఇలా పాన్ ఇండియా హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా( Kalki ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూ అత్యధిక మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి హీరోగా ప్రభాస్ పేరు సంపాదించుకున్నారు.
ఈయన ఒక్కో సినిమాకు 150 నుంచి 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
![Telugu Anushka Shetty, Bahubali, Bollywood, Farm, Prabhas, Rajamouli, Tollywood- Telugu Anushka Shetty, Bahubali, Bollywood, Farm, Prabhas, Rajamouli, Tollywood-](https://telugustop.com/wp-content/uploads/2024/03/Rajamouli-prabhas-tollywood-Bahubali-farm-house-bahubali-2-anushka-shetty.jpg)
ఇక ప్రభాస్ కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైనప్పటికీ ఈయనని పాన్ ఇండియా స్టార్ చేసినటువంటి సినిమా బాహుబలి ( Bahubali ).రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా తర్వాత ఈయన సినిమాలు భారీ బడ్జెట్ చిత్రాలుగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి.ఇక ఈయన నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం బాహుబలి సినిమా కోసం ఈయన తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతము ఒక వార్త వైరల్ గా మారింది.
![Telugu Anushka Shetty, Bahubali, Bollywood, Farm, Prabhas, Rajamouli, Tollywood- Telugu Anushka Shetty, Bahubali, Bollywood, Farm, Prabhas, Rajamouli, Tollywood-](https://telugustop.com/wp-content/uploads/2024/03/Rajamouli-prabhas-tollywood-bollywood-social-media-Bahubali-bahubali-2.jpg)
ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈయన తీసుకున్నటువంటి ఈ 100 కోట్ల రెమ్యూనరేషన్ తో ఏం చేశారనే విషయానికి సంబంధించి ఈ వార్త వైరల్ గా మారింది.ప్రభాస్ కి నేచర్ అంటే చాలా ఇష్టం.అందుకే తాను ఎక్కువగా తన ఇంటి ఆవరణంలో మొక్కలు ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ సినిమా నుంచి తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ మొత్తం తన ఫామ్ హౌస్ కోసమే ఖర్చు పెట్టారని తెలుస్తోంది.
![Telugu Anushka Shetty, Bahubali, Bollywood, Farm, Prabhas, Rajamouli, Tollywood- Telugu Anushka Shetty, Bahubali, Bollywood, Farm, Prabhas, Rajamouli, Tollywood-](https://telugustop.com/wp-content/uploads/2024/03/Rajamouli-prabhas-tollywood-bollywood-Bahubali-bahubali-2-anushka-shetty.jpg)
ఇలా తన ఫామ్ హౌస్ చుట్టూ ఎన్నో చెట్లను పెంచాలని, తన ఫామ్ హౌస్ చుట్టూ పక్షుల కిలకిలలు వినాలన్న ఉద్దేశంతో ఎక్కువగా తన ఫామ్ హౌస్ లో గార్డెన్ ఏర్పాటు చేయడం కోసమే ఈ డబ్బు మొత్తం ఖర్చు పెట్టారని ఈ వార్త వైరల్ గా మారింది.ఈ వార్తలపై పలువురు స్పందిస్తూ ప్రభాస్ కు నేచర్ అంటే అంత ఇష్టమా అందుకే అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.