బైక్‌లో పెట్రోల్ లేదని జరిమానా.. కంగుతిన్న వాహనదారుడు

వాహనదారులు ఒక్కోసారి రోడ్డు ఎక్కాలంటే భయపడుతుంటారు.ఏ రోడ్డు మూలలోనో ట్రాఫిక్ పోలీసులు కనిపించి, ఎక్కడ ఏదో ఒక కారణం చూపి ఫైన్ వేస్తారేమోనని భయం.

 Penalty For Not Having Petrol In The Bike Confused Motorist , Bike, Petrol, Less-TeluguStop.com

దీంతో వారిని తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.అయినప్పటికీ ఏదో ఒక చోట ట్రాఫిక్ పోలీసులకు దొరికేస్తారు.

వారు వేసే జరిమానా కట్టలేక ఇబ్బంది పడుతుంటారు.నిబంధనలు పాటించాలని ఎంత చెప్పినా వాహనదారులు పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతుంది.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా వాహనాలను నడపడం చాలా మందికి సాధ్యపడడం లేదు.ఎక్కడో ఓ చోట కనీసం సిగ్నల్ జంప్ అయినా చేసేస్తున్నారు.

అయితే ఇవి ఎలా ఉన్నా, ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు వెరైటీ ఫైన్లు వేస్తుంటారు.ఇదే తరహాలో తిరువనంతపురంలో ఓ వ్యక్తికి వింత జరిమానా వేశారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తిరువనంతపురంలో ఇటీవల ఓ వ్యక్తి రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై దర్జాగా వెళ్తున్నాడు.

అయితే రాంగ్ రూట్‌లో అతడు వెళ్లడం చూసి ఓ ట్రాఫిక్ పోలీసు అతడిని ఆపాడు.రాంగ్ రూట్‌లో ఎందుకు వెళ్తున్నావని నిలదీశాడు.ఆ తర్వాత అతడికి రూ.250 ఫైన్ వేశాడు.ఆ తర్వాత ఇంటికి చేరుకున్న ఆ వాహనదారుడు తన ఫోన్‌కు వచ్చిన జరిమానా చూశాడు.అయితే అందులో ఫైన్ వేయడానికి చూపిన కారణం చూసి కంగుతిన్నాడు.వాహన ట్యాంకులో సరిపడా ఇంధనం లేనందున ఫైన్ వేసినట్లు ఉంది.దీంతో ఇదెక్కడి కారణం అంటూ ఆ వాహనదారుడు అవాక్కయ్యాడు.

తనకు వచ్చిన ఆ ఫైన్ రసీదును నెట్టింట్లో పెట్టగా బాగా వైరల్ అయింది.గతంలో కూడా కారులో ఉన్న వ్యక్తులు హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్లు వేసిన దాఖాలాలను చాలా మంది గుర్తు చేస్తున్నారు.

ఇది కూడా అదే తరహాలో ఉందని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube