టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ మార్కెట్ ఎంత అనే ప్రశ్నకు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తాయనే సంగతి తెలిసిందే.విజయ్ దేవరకొండ నటించి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటే విజయ్ నటించి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి.
అయితే లైగర్ మూవీ దక్షిణాది హక్కులు రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సౌత్ హక్కులు 70 కోట్ల రూపాయలకు వరంగల్ శ్రీను కొనుగోలు చేశారని సమాచారం.70 కోట్ల రూపాయలు ఎక్కువ మొత్తమే అయినాప్పటికీ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం ఈ స్థాయిలో సినిమా కలెక్షన్లను సాధించడం కష్టమేమీ కాదని చెప్పవచ్చు.అయితే పూరీ జగన్నాథ్ మాత్రం మరో పదికోట్ల రూపాయలు రికవరీ అడ్వాన్స్ గా ఇవ్వాలని కోరినట్టు బోగట్టా.

వరంగల్ శ్రీను ఈ సినిమా డైరెక్ట్ గా రిలీజ్ చేయకుండా ఏరియాల వారీగా అమ్మేస్తున్నారని తెలుస్తోంది.లైగర్ వైజాగ్ హక్కులను కొరటాల శివ సన్నిహితుడైన మిక్కిలినేని సుధాకర్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.తూర్పు గోదావరి హక్కులను భరత్ చౌదరి తీసుకున్నారని బోగట్టా.మిగిలిన ఏరియాలకు సంబంధించి డిస్కషన్లు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.

నైజాంలో దిల్ రాజు, వరంగల్ శ్రీను మధ్య గట్టి పోటీ ఉంది.ఆచార్య సినిమా ఫలితం వరంగల్ శ్రీనుపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.ఆచార్య నష్టాలు ఈ సినిమాతో భర్తీ అవుతాయని వరంగల్ శ్రీను భావిస్తున్నారని సమాచారం అందుతోంది.లైగర్ సినిమా సక్సెస్ సాధించడం విజయ్ దేవరకొండ కెరీర్ కు కూడా ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే.
యూత్ లో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడటం గమనార్హం.