రామారావు.. ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తారు సామి.. ఈసారి అలీతో..!

ఈమధ్య కాలంలో సినిమాని ప్రేక్షకులకు చేరువేయాలి అంటే ప్రమోషన్స్ చాలా అవస్రమని గుర్తించారు.సినిమా మీద ఎంత ఆసక్తి కలిగిస్తే అంత మంది ఆడియెన్స్ థియేటర్ కి వెళ్లి సినిమా చూసే అవకాశం ఉందని తెలిసింది.

 Ramarao Promotions Another Interview With Star Comedian Ali , Ali,ramarao, Ramar-TeluguStop.com

అందుకే రిలీజ్ అయ్యే సినిమాలన్ని వరుస ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలో శుక్రవారం రిలీజ్ అవుతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు.

ఇప్పటికే ఐదారు ఇంటర్వ్యూస్ దాకా చేసిన రవితేజ అండ్ టీం లేటెస్ట్ గా మరో ఇంటర్వ్యూతో వస్తుంది.ఈసారి అలితో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు చిత్రయూనిట్.

రవితేజ, అలి కాంబో అంటే అదో సూపర్ హిట్.ఆన్ స్క్రీన్ లో వీరిద్దరి కామెడీకి కడుపు చెక్కలయ్యేలా నవ్వుతాం.అయితే వీరిద్దరి ఆఫ్ స్క్రీన్ కామెడీ ఎలా ఉంటుందో ఈ ఇంటర్వ్యూలో తెలుస్తుంది.అలి తో స్పెషల్ గా రామారావు టీం ఇంటర్వ్యూ నిర్వహించారు.

ప్రోమోతోనే అలి నీ సీక్రెట్ చెప్పేయ్ మంటావా అని రవితేజ బెరిస్తున్నట్టు ఉంది.ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు.

రవితేజ రామారావు సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటించింది.

Telugu Ramarao, Raviteja, Sharath Mandava, Tollywood-Movie

ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా కనిపించనున్నారు.రవితేజ మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.మొదటి సినిమానే అయినా దర్శకుడు శరత్ మండవ సినిమాని చాలా ఫోకస్ తో తెరకెక్కించాడని ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తుంది. రవితేజ కూడా ఈ సినిమాపై పూర్తి నమ్మకంగా ఉన్నారు.

ఈ సినిమా తర్వాత రవితేజ నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో ధమాకా సినిమా చేస్తున్నారు.ఆ సినిమాలో పెళ్లిసందడి భామ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube