2024 ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక ( Bhimavaram, Gajuwaka )నియోజకవర్గాల నుండి మొట్టమొదటిసారి ఎన్నికలలో పోటీ చేసి రెండు చోట్ల ఓటమిపాలయ్యారు.దీంతో ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ సీరియస్ గా ఫిక్స్ అయ్యారు.మరి ముఖ్యంగా వైసీపీ ( YCP )పార్టీ అధికారంలోకి రాకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా… తెలుగుదేశం, బీజేపీ పార్టీ ఏకతాటి పైకి తెచ్చి కూటమి ఏర్పడేలా కీలక పాత్ర పోషించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్నికలకు ఇంకా 50 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారం విషయంలో స్పీడ్ పెంచారు.ఆల్రెడీ జనసేన పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేయడం జరిగింది.దీంతో ఇకనుండి జనంలోకి వెళ్ళటానికి పవన్ రెడీ కావడం జరిగింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదలైంది.ఈ నెల 30న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని.
అక్కడ ఉంటూనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి వెళ్తారని పార్టీ వెల్లడించింది.తొలిరోజు శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని, అనంతరం దత్తపీఠాన్ని దర్శించుకోనున్న ఆయన.ఆ తర్వాత మూడు రోజులు పిఠాపురంలోనే ఉంటారు.ఉగాది వేడుకలను కూడా అక్కడే పవన్ నిర్వహించుకోబోతున్నారు.