రేపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలకు టీడీపీ జనసేన పార్టీలు పొత్తులు( TDP Janasena Alliance ) పెట్టుకోవడం తెలిసిందే.

 Pawan Kalyan To Tdp Chief Chandrababu House Tomorrow, Pawan Kalyan, Tdp, Chandra-TeluguStop.com

ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు కలిసి ఉమ్మడి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.అదేవిధంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోపై కూడా చర్చిస్తూ ఉన్నారు.

పరిస్థితి ఇలా ఉంటే రేపు ఏపీలో ఓట్ల తొలగింపు అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధం కావడం జరిగింది.ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.

ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా( AP Chief Electoral Officer Mukesh Kumar Meena ) తెలుగుదేశం రిప్రజెంటేషన్ కు సమాధానం ఇవ్వడం జరిగింది.వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో.

రాష్ట్రంలో సుమారు 5 లక్షల 64 వేల ఓట్లను తొలగించినట్లు తెలిపారు.ఓటర్ల జాబితా తప్పిదాలపై చర్యలు తీసుకున్నట్లు కూడా స్పష్టం చేశారు.

పరిస్థితి ఇలా ఉండగా రేపు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవకముందు గుంటూరు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి బాబు అల్పాహార విందు ఇవ్వనున్నారు.అనంతరం ఇరువురు కలిసి ఈసీ వద్దకు వెళ్లి దొంగ ఓట్ల నమోదుపై ఫిర్యాదు చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube