జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) నేడు పిఠాపురంలో నామినేషన్ వేయటం జరిగింది.ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
అనంతరం ఉప్పాడలో వారాహి విజయభేరి బహిరంగ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… దేశం మొత్తం చూసేలా పిఠాపురం నియోజకవర్గం ( Pithapuram Constituency )అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు.
ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యే లాగా ఉండాలి అని దేశం మొత్తం చెప్పేలా… చేస్తానని అన్నారు.అన్ని రంగాలలో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు.
అన్ని రకాల రైతాంగాన్ని ఆదుకుంటాం.
పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తాం.ఉప్పాడలో( uppada ) ప్రత్యేకంగా బీచ్ కారిడార్ కూడా ఏర్పాటు చేస్తాం.తూర్పుగోదావరి మొత్తం ఉప్పాడ బీచ్ గురించి మాట్లాడుకునేలా అభివృద్ధి చేస్తాం.
యువతకు ఉపాధి కల్పిస్తామని పవన్ కళ్యాణ్ సంచలన స్పీచ్ ఇచ్చారు.ఇక్కడికే పరిశ్రమలు తీసుకొస్తామని పవన్ స్పష్టం చేయడం జరిగింది.
భారీ మెజారిటీతో గెలిపించండి… రైతులకు అసెంబ్లీలో గొంతునవుతానని చెప్పుకొచ్చారు.కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలను కలవడం జరిగింది.వాళ్ళ యొక్క సమస్యలను వినటం కూడా జరిగింది.
ఈ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించండి.అన్ని సమస్యలను పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు.