ఆర్థిక సంక్షోభం కారణంగా ఆఖరికి ఎంబసీ భవనాన్ని అమ్మేసుకున్న పాకిస్తాన్.. ఎక్కడంటే?

పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది.చాలాకాలంగా బకాయిపడ్డ ఉద్యోగుల జీతాలు, భారీగా పెరిగిన అప్పులు తీర్చేందుకు వేరే మార్గం లేక, పాక్ ప్రభుత్వం వాషింగ్టన్ లోని( Washington ) పాక్ ఆస్తులను వేలంలో ఉంచింది.ఈ క్రమంలో అమెరికాలోని అమ్మేందుకు పెట్టిన ఎంబసీ కార్యాలయం 7.1 మిలియన్ డాలర్లకు అమ్ముడైందని విశ్వసనీయ వర్గాల సమాచారం.వాషింగ్టన్ లోని పాకిస్తాన్ చారిత్రాత్మక భవనమైన ఎంబసీ బిల్డింగ్( Pakistan Embassy ) 2003 నుంచి ఖాళీగానే వుంటుందనే విషయం అందరికీ తెలిసినదే.దాంతో 2018లో దౌత్య హోదాను కూడా కోల్పోయింది.అయితే, ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్‌కు చెందిన ఓ రియాల్టీ సంస్థతో సహా పలు సంస్థలు పోటీపడగా చివరకు పాకిస్తాన్ కు చెందిన బిజినెస్ మెన్ హఫీజ్ ఖాన్ దీన్ని 7.1 మిలియన్ డాలర్లకు దక్కించుకున్నాడు.

 Pakistan Finally Sold The Embassy Building Due To Financial Crisis Details, Paki-TeluguStop.com
Telugu America, Columbia, Pakistan, Pakistanembassy, Street, Washington-Latest N

పాకిస్థాన్‌కు వాషింగ్టన్‌లో 2 చోట్ల ఎంబసీ ఆఫీసులు ఉండడం గమనార్హం.ఆర్‌ స్ట్రీట్‌లో ఉన్న ఈ బిల్డింగ్ ను 1956లో కొనుగోలు చేయగా, 2000 వరకు అందులో కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగాయి.కాకపోతే పాకిస్థాన్ ( Pakistan )గత దశాబ్దకాలానికి పైగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.దాంతో క్రమేపీ అందులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి.డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా( District Of Columbia ) ఈ బిల్డింగ్ ను దుర్భర స్థితిలో ఉన్న ఆస్తుల లెక్కలో చేర్చడంతో దీని అంచనా విలువతో పాటు టాక్స్ కూడా భారీగా పెరిగింది.శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు గతేడాది బిడ్ లను పాకిస్థాన్ ప్రభుత్వం ఆహ్వానించింది.

Telugu America, Columbia, Pakistan, Pakistanembassy, Street, Washington-Latest N

ఆ తరువాత ఈ బిల్డింగ్ త్వరితగతిన మార్చిన పాకిస్తాన్ అధికారిక వర్గం ఎటువంటి వివరణ ఇవ్వకుండానే బిడ్డింగ్ ప్రక్రియను నిలిపి వేసింది.ఒకపుడు క్లాస్ -2 హోదాలో ఉన్న ఈ భవనం ఆ తర్వాత క్లాస్-3 కి, ఇప్పుడు క్లాస్-4 స్థాయికి పడిపోవడం కొసమెరుపు.ఇది పాక్ ప్రభుత్వం ఫెయిల్యూర్ గా అక్కడి మీడియాలో అనేక కధనాలు వెలువడడం మనం చూసాం.ఆఖరికి పాకిస్థాన్ కు ఆర్థికమాంద్యం దెబ్బకు దానిని అమ్ముకునే దుస్థితి పట్టింది మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube