ఆ స్టోర్‌ ముందు బోర్డు చూసి పారిపోతున్న కస్టమర్లు... కారణం ఇదే!

అవును, మీరు విన్నది నిజమే.ఆ స్టోర్‌ ముందు బోర్డు చూసి కస్టమర్లు లోపలి వెళ్లకుండానే దానిముందు నుండి పారిపోతున్నారు.

 Spanish Grocery Store To Charge Tourists Who Come In Just To Look Details, Spani-TeluguStop.com

వినడానికి చోద్యంగా వున్నా ఇది నిజమే.అంతటి ఘనకార్యం అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే, మీరు ఈ పూర్తి కధనం చదవాల్సిందే.

సాధారణంగా మనలో చాలామంది ఈవినింగ్ అలా టైమ్ పాస్ కోసం కొందరు గ్రాసరీ స్టోర్స్‌, షాపింగ్ మాల్స్ లాంటివి సందర్శించడానికి వెళుతూ వుంటారు.అక్కడికి వెళ్ళినపుడు జస్ట్ వాటిని చూసి ఎంజాయ్ చేస్తుంటారు తప్ప ఏమీ కొనరు.

అయితే ఇపుడు అలాంటివారి పప్పులు ఉడకవు అని చెప్పుకోవాలి.అవును, మీరు గనక ఆ షాపులోకి అడుగుపెడితే రుసుము చెల్లించాల్సిందే.

అక్కడ ఏం కొనకపోయినా మీరు డబ్బులు కట్టాల్సి ఉంటుంది మరి.

Telugu Barcelona, Charge, Mrria, Spain, Spain Store, Spanishgrocery, Store, Stor

మనలా టైం పాస్ చేసే బ్యాచ్ తో విసిగిపోయిన స్పానిష్ గ్రాసర్టీ స్టోర్ అయిన “బార్సినాలోని క్యూవియర్స్ ముర్రియా” కేవలం విండో షాపింగ్‌కు( Window Shopping ) మాత్రమే వస్తే దాదాపు రూ.500 ఫైన్ వేస్తామని బోర్డు పెట్టి మరీ హెచ్చరిస్తోంది.దాదాపు శతాబ్ద కాలంగా క్యూవియర్స్ ముర్రియా (Queviures Múrria) ప్రజల మన్ననలు పొందుతుంది.

బార్సిలోనాలోని( Barcelona ) అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఇది ఒకటిగా నిలుస్తోంది.స్టోర్ పాతకాలపు రూపం, ఇంటీరియర్ సాంప్రదాయ రూపకల్పన ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

Telugu Barcelona, Charge, Mrria, Spain, Spain Store, Spanishgrocery, Store, Stor

అక్కడే వచ్చింది అసలు చిక్కు.దాంతో చాలా మంది లోపల విక్రయించే ఉత్పత్తులపై ఆసక్తి కనబరచరు.పైగా స్టోర్‌లోకి ప్రవేశించి ఫొటోలు దిగుతూ తెగ తిరుగుతూ వుంటారు.ఈ క్రమంలో ఏమీ కొనకుండానే వెళ్లిపోతారు.దీంతో విసుగుచెందిన యజమాని జరిమానా( Fine ) విధించే పద్ధతిని తీసుకొచ్చాడు.అయితే ఈ నిర్ణయం మాత్రం నెట్టింట తెగ విమర్శలను ఎదుర్కొంటోంది.

అసలు ఏ తప్పు చేయని పర్యాటకులకు ఫైన్ ఎలా విధిస్తారని ప్రశ్నిస్తున్నారు.కానీ ఈ విషయంలో అక్కడి స్టాఫ్, యాజమాన్యం ఈ డెసిషన్‌కే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.

అవును, అక్కడకి వచ్చిన కస్టమర్లు కనీసం 50 శాతం మందికి కూడా అక్కడి ప్రొడక్ట్స్ ని కొనడంలేదంటూ వాపోతున్నారు.దాంతో ఈ నిర్ణయం తీసుకోవడం తప్పలేదని చెప్పుకొస్తున్నారు.

ఐడియా బాగుంది కదూ!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube