నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కీలక ప్రకటన చేశారు.దేశంలో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు.
ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్టంగా తయారు చేస్తామన్నారు.అదేవిధంగా శక్తివంతమైన ఖండాంతర క్షిపణులు ఐసీఎంబీలను తయారు చేస్తామని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే తూర్పు జలాల్లోకి బాలిస్టిక్ మిసైల్ ను ప్రయోగించి నూతన సంవత్సరానికి కిమ్ స్వాగతం పలికారు.