పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా 11 గంటలకు ప్రధాని మోడీ ( Modi ) పార్లమెంట్ లో సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు.
ఈ తరుణంలోనే ఆయన పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై అనేక విషయాలు తెలియజేశారు.ఇదే తరుణంలో తెలంగాణ బిల్లుపై మోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ( KTR ) తీవ్రంగా మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా ఆయన మోడీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోడీ తెలంగాణ విరోధి అని , ఆయనకు తెలంగాణ రాష్ట్రంపై ఇంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు.
అమృతకాల సమావేశాలని పేరు పెట్టి విషం చిమ్మడం ఆయన సంస్కారానికి వదిలేస్తున్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ( Telangana ) అంటేనే గిట్టనట్టు, పగ పట్టినట్టు, మా పుట్టుకను ప్రశ్నించడం, తల్లిని చంపి బిడ్డను తీసారని అజ్ఞానం అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని అన్నారు.14 సంవత్సరాలు పోరాడి ఎంతోమంది బలిదానం వల్ల ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని, అలాంటి ఈ రాష్ట్రంపై చులకన భావం ఎందుకని, పనిగట్టుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని గాయపరిచి మీరు ఆనందిస్తున్నారని తెలిపారు.వడ్లు కొనమని మేము అడిగితే, నూకలు బుక్కమంటూ రైతులను కించపరిచారని, నీలాగే మీ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారని ఎద్దేవ చేశారు.మూటలు ఎలాగూ మా రాష్ట్రానికి ఇవ్వరు, కనీసం మాటల్లో అయిన మర్యాద చూపించండి అంటూ ప్రశ్నించారు.
ఇలా కొత్త రాష్ట్రంపై మొదటి నుంచి కక్ష పెంచుకొని, వివక్ష చూపిస్తున్నారని, ఏడు మండలాలను గుంజుకొని లోయర్ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలి ద్రోహం తెలంగాణ ప్రజలు మర్చిపోరని అన్నారు.
కృష్ణ ( Krishna ) నీటి వాటాలు తెల్చకుండా పదేళ్లుగా కాలయాపన చేస్తున్నారని తెలిపారు.అంతేకాకుండా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ ( Gujarath ) కు తరలించిపోయి, దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని మేము క్షమించమని తెలిపారు.150 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని , సింగరేణి బొగ్గు బావులని వేలం వేయడమే కాకుండా ఐటిఐఆర్ ను రద్దు, హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేక మీరు నిధులు ఇవ్వరని , మేము సొంతంగా నిధులు ఏర్పాటు చేసుకుంటే ఆంక్షలు విధిస్తారని ప్రశ్నించారు.ఈడి, సిబిఐ లను మీ ఎన్డీఏ కూటమిలో చేర్చుకొని ప్రతిపక్షాలపై ఉసిగొల్పి ప్రభుత్వాలని పడగొట్టడమే పనిగా పెట్టుకున్న మీరు, ప్రొద్దున లేవగానే ప్రజాస్వామ్య సూక్తులు చెప్పడం విచిత్రంగా ఉందని అన్నారు.డబల్ ఇంజన్ సర్కార్ అంటూ ఊదరగొట్టే మాటలు మాట్లాడే మీకు తెలంగాణలో డబల్ డిజిట్ సీట్లు కూడా రావని అన్నారు.