Chiranjeevi Dil Raj : చిరంజీవి కామెంట్ల వెనుక ఇంత అర్థముందా.. దిల్ రాజుకు సుతిమెత్తగానే క్లారిటీ ఇచ్చారుగా!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఇండస్ట్రీని తమ కనుసైగలతోనే శాసిస్తూ ఉంటారు.ముఖ్యంగా పండగల సమయంలోను పెద్ద సినిమాల విడుదల సమయంలోను చిన్న సినిమాలపై తప్పనిసరిగా వేటు వేస్తూ ఉంటారు.

 Megastar Chiranjeevi Intresting Comments On Dill Raju Details Inside-TeluguStop.com

అలాంటి వాళ్లు మన తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా కొంతమంది ఉన్నారు.తరచూ ఈ సినిమాల విడుదలపై థియేటర్లు కేటాయించడంపై వివాదాలు జరుగుతూనే ఉంటాయి.

ఇలాంటి వివాదాలలో ముందుంటారు నిర్మాత దిల్ రాజు( Dil Raj ) .ఈయన నిర్మాతగా మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ కూడా అలాగే థియేటర్ ఓనర్ గా కూడా ఇండస్ట్రీలో వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Chiranjeevi, Dil Raju, Guturu Karam, Hanuman, Prashanth Varma, Tollywood,

ఇకపోతే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతున్నటువంటి సినిమాలలో గుంటూరు కారం ( Gunturu Kaaram ) సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు.ఈ సినిమాకు పోటీగా వస్తున్నటువంటి హనుమాన్( Hanuman ) సినిమాకు మాత్రం థియేటర్లో లేకుండా కేవలం నాలుగు థియేటర్లు మాత్రమే నైజాం ఏరియాలో కేటాయించారు.తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న రాత్రి హైదరాబాద్లో ఎంతో ఘనంగా జరిగింది.

Telugu Chiranjeevi, Dil Raju, Guturu Karam, Hanuman, Prashanth Varma, Tollywood,

హనుమాన్ సినిమా వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పరోక్షంగా దిల్ రాజు పై చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Chiranjeevi, Dil Raju, Guturu Karam, Hanuman, Prashanth Varma, Tollywood,

గతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇలా పెద్ద సినిమాలు విడుదలవుతున్నటువంటి తరుణంలో దిల్ రాజు తన చిన్న సినిమా అయినటువంటి శతమానం భవతి సినిమాని విడుదలకు తీసుకోవచ్చారు.ఇలా పెద్ద సినిమాలు వస్తున్నటువంటి తరుణంలో చిన్న సినిమా విడుదల ఎందుకు అని చిరంజీవి ప్రశ్నించడంతో కంటెంట్ బాగుంది సార్ అంటూ ఆ సినిమాని విడుదల చేశారు.

అదే దిల్ రాజు ఇప్పుడు కంటెంట్ బాగున్నా ఒక చిన్న సినిమా విడుదలను అడ్డుకుంటున్నారు అంటూ పరోక్షంగా ఈయన కామెంట్లు చేశారు.హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) ను పిలిపించి మరి ఇప్పుడు ఎందుకు విడుదల చేయడం వాయిదా వేసుకో అంటూ ఆయనకు చెప్పి చూశారు కానీ ప్రశాంత్ వర్మ మాత్రం వినకపోవడంతో తన మాస్ యాంగిల్ చూపించి కనీసం నైజం ఏరియాలో సరైన థియేటర్లను కూడా కేటాయించకపోవడంతో పరోక్షంగా దిల్ రాజు పట్ల చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube