ఏపీలో జనసేన పార్టీ( Janasena Party )కి మరో షాక్ తగిలింది.ఆ పార్టీకి కీలక నేతగా ఉన్న పోతిన మహేశ్ గుడ్ బై చెప్పారని తెలుస్తోంది.
ఈ మేరకు పార్టీ పదవితో పాటు సభ్యత్వానికి పోతిన మహేశ్( Pothina Mahesh ) రాజీనామా చేశారని సమాచారం.అనంతరం తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కు పంపారని సమాచారం.
అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన మహేశ్ సీటు దక్కకపోవడంతో గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే విజయవాడలో మద్ధతుదారులతో కలిసి దీక్ష కూడా చేశారు.
గత ఐదేళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానన్న ఆయన తనకే టికెట్ ను కేటాయించడం న్యాయమంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.