విజృంభిస్తున్న డెంగ్యూ.. దీని ప్రధాన లక్షణాలు ఏంటి.. ఈ వైరల్ వ్యాధిని ఎలా గుర్తించాలి?

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డెంగ్యూ( Dengue ) విజృంభిస్తోంది.తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా డెంగ్యూ ఫీవర్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

 What Are The Symptoms Of Dengue And How To Find It Details, Dengue Fever, Dengue-TeluguStop.com

డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్.ఈడిస్ ఈజిప్టి దోమ( Aedes Aegypti Mosquito ) కాటు కారణంగా డెంగ్యూ వ్యాపిస్తుంది.

సకాలంలో డెంగ్యూ వ్యాధిని గుర్తిస్తే చికిత్స ద్వారా వేగంగా బయటపడవచ్చు.లేదంటే ప్లేట్ లెట్స్ భారీగా పడిపోయి ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది.

ఈ నేపథ్యంలోనే డెంగ్యూ ప్రధాన లక్షణాలు( Dengue Symptoms ) ఏంటి.? ఈ వైరల్ వ్యాధిని గుర్తించడం ఎలా.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.డెంగ్యూ సోకిన‌ప్పుడు జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, కీళ్ళు మరియు కండరాల్లో నొప్పి, ఉబ్బిన గ్రంధులు, కళ్ళ వెనుక నొప్పి, చర్మంపై దద్దుర్లు ప్రధాన లక్షణాలుగా క‌నిపిస్తాయి.

ఒక‌వేళ డెంగ్యూ తీవ్రతరంగా మారినప్పుడు నిరంతర వాంతులు, అలసట, ముక్కు లేదా చిగుళ్ళ నుండి రక్తస్రావం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన కడుపు నొప్పి, నీరసం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Telugu Aedesaegypti, Dengue, Dengue Symptoms, Tips, Latest, Mosquitoes-Telugu He

ఈ ల‌క్ష‌ణాల‌ను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించి డెంగ్యూ సంబంధిత పరీక్షలు( Dengue Tests ) చేయించుకోవాలి.డెంగ్యూ నిర్దారణ అయితే తగు చికిత్స తీసుకోవాలి.

సాధార‌ణ‌ డెంగ్యూ ఉన్న చాలా మంది ఒక‌టి నుంచి రెండు వారాల్లో రిక‌వ‌రీ అవుతారు.తీవ్రమైన డెంగ్యూ ఉన్నవారు వ్యాధి నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.

Telugu Aedesaegypti, Dengue, Dengue Symptoms, Tips, Latest, Mosquitoes-Telugu He

ఇక డెంగ్యూ బారిన పడిన తర్వాత బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.డెంగ్యూ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవ‌డానికి దోమల వృద్ధి చేయకుండా చూసుకోవాలి.దోమల బెడదను తగ్గించకునేందుకు ఇంటి పరిసరాల్లో ఎలాంటి నీటి నిల్వలు, చెత్త‌ లేకుండా చేసుకోవాలి.పరిసరాల‌ను శుభ్రంగా ఉంచుకోవాలి.ఇంట్లోకి దోమలు రాకుంగా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.దోమ‌తెర‌ల‌ను వినియోగించాలి.

దోమలు కుట్టకుండా మస్కిటో రిపెల్లెంట్స్ ఉపయోగించాలి.శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.

ఇక వీటితో పాటు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube