జనసేనకు పోతిన మహేశ్ రాజీనామా..!

ఏపీలో జనసేన పార్టీ( Janasena Party )కి మరో షాక్ తగిలింది.ఆ పార్టీకి కీలక నేతగా ఉన్న పోతిన మహేశ్ గుడ్ బై చెప్పారని తెలుస్తోంది.

ఈ మేరకు పార్టీ పదవితో పాటు సభ్యత్వానికి పోతిన మహేశ్( Pothina Mahesh ) రాజీనామా చేశారని సమాచారం.

అనంతరం తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కు పంపారని సమాచారం.

అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన మహేశ్ సీటు దక్కకపోవడంతో గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే విజయవాడలో మద్ధతుదారులతో కలిసి దీక్ష కూడా చేశారు.గత ఐదేళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానన్న ఆయన తనకే టికెట్ ను కేటాయించడం న్యాయమంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.