ఎండాకాలం( Summer ) వచ్చిందంటే చాలు ప్రజలు ఎయిర్ కూలర్లు, ఏసీలు అంటూ ఇంట్లోనే ఉంటూ ఎక్కువ బయట తిరగకుండా కాస్త చల్లటి ప్రదేశంలో ఉండేందుకు ప్రయత్నిస్తారు.ఇక మనుషుల సంగతి పక్కన పెడితే.
మరి జంతువులకు( Animals ) పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించండి.ఎటువంటి ఆవాసయోగ్యం లేని జంతువులు ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతుంటాయి.
ఇకపోతే మనుషులకు అలవాటు పడ్డ జంతువులు మాత్రం వారి సహాయంతో ఎలాగోలాగా కాస్త ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతాయి.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక వైరల్ గా మారిన వీడియోలో చూస్తే.ఓ వ్యక్తి ఎండ వేడికి తట్టుకోలేకపోతున్న వీధి కుక్కకు( Stray Dog ) ఒంటిపై నీళ్లు పోసి ఉపశమనం కలిగించాడు.అయితే అలా చేయడం ద్వారా ఆ కుక్కకు ఎంతో ఉపశమనం లభించడంతో ప్రతిరోజు అలా కావాలని తరచూ అతడి సాయం కోసం సదరు పెట్రోల్ బంకు( Petrol Bunk ) రావడం మొదలుపెట్టింది.దీంతో తాజాగా ఓ రోజు ఆ కుక్క పెట్రోల్ బంకు కూడా వచ్చింది.
నేరుగా అతడి దగ్గరికి వెళ్లి నిలబడింది.తనకి ఎండ వేడి నుంచి సహాయం చేయమని అర్థం వచ్చేలా అతడు ఉన్నచోటే దీనంగా నిలబడి.
అతన్ని చూస్తూ ఉండిపోయింది.ఇక ప్రతిసారి చేసే పనే కదా అని అర్థం చేసుకున్న వ్యక్తి కూడా వెంటనే తన చేయాల్సిన పని చేసేశాడు.
దాంతో ఆ వ్యక్తి కుక్కపై తన చేతులు దోసిల్లుతో నీళ్లు చల్లుతూ ఎండ వేడిమి నుంచి కుక్కను ఉపశమనం అందించాడు.

ఆ వ్యక్తి నీళ్లు అదేపనిగా చల్లుతుంటే ఆ కుక్క షవర్ కింద ఉన్నట్టుగా తెగ ఫీల్ అవుతోంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీడియో చూసిన నెటిజన్స్ కుక్కే కదా అని నిర్లక్ష్యం చేయకుండా దానికి సహాయ పడ్డ వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.బయట గుళ్ళలో హుండీలో వేసే డబ్బులకంటే.
ఇలా కనిపించే వాటి కి సహాయం చేయడం ఎంతో మేలు అంటూ అతన్ని పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.







