ఇదేందయ్యా ఇది... బస్సు డ్రైవర్ గా మారిన మహేంద్రసింగ్ ధోని... వీడియో వైరల్!

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.ధోనీ 2020 ఆగస్టు నెలలో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.

 Mahendra Singh Dhoni Who Has Become A Bus Driver Video Goes Viral, Bus Driver,-TeluguStop.com

కానీ ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతూ తన సత్తా చాటుతున్నాడు.ధోనీ పని అయిపోయిందని కామెంట్లు చేసిన వారందరికీ ఆయన తన అద్భుతమైన ప్రతిభతో తగిన సమాధానం చెప్పి నోళ్ళు మూయించాడు.

రెండేళ్ల క్రితం జరిగిన సీజన్‌లో ప్లేఆఫ్స్‌ కూడా చేరకుండా ఇంటిముఖం పట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ను గత సీజన్‌లో ఛాంపియన్ గా నిలబెట్టాడు ధోనీ.ఇలాంటి బ్రహ్మాండమైన కం బ్యాక్ ఇవ్వడం కేవలం ఒక్క ధోనీ కి మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇక 2022 మెగా టోర్నీలోనూ చెన్నైని విజేతగా నిలబెట్టాలని ధోనీ దృఢ సంకల్పం, పట్టుదలతో ఉన్నాడు.అయితే తాజాగా బస్సు డ్రైవర్ అవతారం ఎత్తి అందర్ని ఆశ్చర్య పరుస్తున్నాడు ధోనీ.

తాజాగా ఐపీఎల్ 2022 సీజన్ ని ప్రసారం చేసే స్టార్‌స్పోర్ట్స్‌ ఇండియా ఓ ప్రోమో లేదా టీజర్‌ను విడుదల చేసింది.ఇందులో ధోనీ ఖాకీ కలర్ డ్రెస్ లో బస్సు డ్రైవర్‌ లుక్‌లో కనిపించాడు.

ఈ కొత్త లుక్‌ ఎలా ఉందో చెప్పాలి అంటూ క్రికెట్ ప్రియులను స్టార్‌స్పోర్ట్స్‌ కోరింది.దీంతో అభిమానులు ధోనీ అన్న లుక్ కెవ్వు కేక అని కామెంట్లు చేస్తున్నారు.

మరికొంత మంది ఫ్యాన్స్ వావ్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈ ప్రోమో వీడియో కాస్త కొత్తగా ఉండటంతో ఫ్యాన్స్ స్టార్ స్పోర్ట్స్ క్రియేటివిటీని పొగుడుతున్నారు.

పోయిన ఏడాది ఐపీఎల్‌ 2021 సీజన్ ప్రోమోలో కూడా ధోనీ వింత గెటప్ లో కనిపించారు.ఈ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఒక సన్యాసి లుక్ లో కనిపించి అప్పుడు కూడా ఫ్యాన్స్ అవాక్కయ్యేలా చేశారు.ధోనీ స్టైలిష్ లుక్ మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube