వైరల్ వీడియో: బల్లిలా గోడలు పాకుతున్న బాలుడు...!

మనకు తెలియని అనేక విషయాలను సినిమాలలో చూపించడం ద్వారా చాలా వరకు తెలుసుకుంటాము.అలాగే సినిమాలో చూసి వారి లాగే చేయాలని చాలామంది కుతూహలం కలిగి ఉంటారు.

 The Boy Climbing The Walls Like A Lizard Lizard, Spiderman, Climbing, Walls, Vi-TeluguStop.com

మరికొందరు సినిమాలోని క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అవుతారు కూడా.అంతేకాకుండా కొంతమంది చిన్న పిల్లలు మ్యూజిక్ చేయడం, సాహసాలు చేయడం, హెయిర్ స్టైల్ లాంటి వివిధ వాటిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు.

అయితే ఇక అసలు విషయంలోకి వెళితే…

ఓ పిల్లవాడు మాత్రం తనకు తాను స్పైడర్ మ్యాన్ ను ఆదర్శంగా తీసుకొని అచ్చం స్పైడర్ మ్యాన్ ఎలా ప్రవర్తిస్తాడో అలాగా మారిపోయాడు.స్పైడర్ మ్యాన్ మూవీ ని పదే పదే చూడగా చివరికి ఆ అబ్బాయి స్పైడర్ బాయ్ గా అవతారమెత్తాడు.

అబ్బాయి చివరికి ఎలా మారిపోయాడు అంటే స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరో ఎలాగైతే భవంతులను ఎలాంటి సహాయం లేకుండా పాకుతాడో… ఆ అబ్బాయి కూడా అలా ఎవరి సహాయం లేకుండానే గోడలు చకచకా ఎక్కేస్తున్నాడు.ఇకపోతే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ కు చెందిన ఓ ఏడు సంవత్సరాల పిల్లవాడు చేస్తున్నాడు.

ఈ పిల్లాడి పేరు యశ్వంత్ సింగ్ గౌగర్.అబ్బాయి మూడో తరగతి చదువుతున్నాడు.

అందరి పిల్లలు వీడియో గేమ్స్, ఆటలు అలా ఆ అబ్బాయి చేయకుండా చిన్నవయసులోనే అనేక సాహసాలను చేస్తున్నాడు.ఎవరికీ సాధ్యం కాని పనులను చేస్తూ ఓౌరా.

అనిపిస్తున్నాడు.ఎలాంటి సహాయం అవసరం లేకుండానే అతను అంతకు అతడే గోడలు ఎక్కేస్తున్నాడు.

అచ్చం బల్లి, స్పైడర్ ఎలా చకచకా పాకుతాయె అలాగే ఆ అబ్బాయి కూడా గోడలు ఎవరి సహాయం లేకుండా అతను పాకుతున్నాడు.ఈ విషయంపై సదరు బాలుని మాట్లాడగా సినిమాలు చూసి తానే స్వయంగా నేర్చుకున్నట్లు తెలియజేశాడు.

అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube