అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన జగన్ ! ప్రకటన పై ఉత్కంఠ 

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పూర్తిగా ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారు.వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారు.

 List Of Candidates Prepared Photos! Excitement Over The Announcement, Ysrcp, Ap-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ నడవబోతుండడంతో ,, గెలిచే అవకాశం ఉన్నవారికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించడంతో పాటు,, ఐ ప్యాక్ బృందాలను రంగంలోకి దింపి సర్వేలు చేయిస్తున్నారు.

  ఈ మేరకు నిఘా నివేదికలు,   ఐ ప్యాక్ టీం ఇచ్చిన సమాచారంతో తొలివిడత 72 స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.దీంట్లో దాదాపు 50 మంది వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా,  మిగతా వారంతా కొత్త వారే.

దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎవరెవరిని తప్పిస్తున్నారు,  కొత్తగా ఎవరికి స్థానం కల్పించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.అతి త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతుండడంతో, ఆ మొదటి విడత జాబితాలో తమ పేర్లు ఉన్నాయా లేదా అని విషయంపై వైసీపీ ఎమ్మెల్యేలు( YCP MLAs ),  ఆశవాహకులు ఆరా తీసే పనిలో పడ్డారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Ysrcp-Politics

ఇక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ పూర్తిగా సంక్షేమ పథకాలపై దృష్టి సారించారు.దీంతోపాటు జగనన్న సురక్ష కార్యక్రమంతో,  వాలంటీర్లు,  గృహసారథులు , సచివాలయ కన్వీనర్లతో పాటు మొత్తం పార్టీ యంత్రాంగం ప్రజల మధ్య ఉండే విధంగా అనేక కార్యక్రమాలను రూపొందించారు.జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, అభ్యర్థుల ఎంపికపై సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతుంది.తమ పేరు లిస్టులో ఉందా లేదా అని దానిపై హైరానా పడుతున్నారు.ప్రస్తుతం 72 మందితో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉండడంతో,  దానిని ఎప్పుడు ప్రకటిస్తారు అసలు అభ్యర్థుల ఎంపికకు వేటిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు ?  సర్వేలో తమకు ఎన్ని మార్కులు పడ్డాయి అనే విషయాల పైన ఆరా తీస్తున్నారు.వీలైనంత ఎక్కువగా ప్రజల్లో ఉండేందుకు , తమ గ్రాఫ్ పెంచుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube