33 ఏళ్ల లావణ్య త్రిపాఠి కొణిదెల( Lavanya Tripathi ) వారింటికి కోడలు అయింది.తన ప్రేమికుడు వరుణ్ తేజ్ తో 2013 లో అట్టహాసంగా లు పూర్తి చేసుకుని అప్పటి నుంచి కెరియర్ ను పక్కన పెట్టింది.
పదహారేళ్ళ వయసుకే ఉత్తరాఖండ్ మిస్ ఫెమిన అవార్డు గెలిచి 22 ఏళ్ల వయసులో అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది లావణ్య త్రిపాఠి.అప్పటి నుంచి 2023 వరకు సినిమాలు తీస్తూ వచ్చింది.అయితే 2023 లో మాత్రం కొంత గ్యాప్ వచ్చింది.2024 సంవత్సరానికి ఒక ఓటిటి ప్రాజెక్ట్ మరియు ఒక సినిమా విడుదలకు సిద్ధమవుతున్నాయి.ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది మరి పెళ్లయ్యాక ఆమె కొత్త సినిమాలను ఒప్పుకోవడం లేదు.
![Telugu Chiranjeevi, Megafanily, Mister, Naga Babu, Ott Project, Tollywood, Varun Telugu Chiranjeevi, Megafanily, Mister, Naga Babu, Ott Project, Tollywood, Varun](https://telugustop.com/wp-content/uploads/2024/01/Lavanya-Tripathi-varun-tej-tollywood-OTT-project-chiranjeevi-megafanily.jpg)
కొణిదల లాంటి ఒక బ్రాండ్ ఉన్న కుటుంబానికి కోడలు కావడంతో ఆమె సినిమాలు పక్కన పెట్టిందా అనే మాట సోషల్ మీడియా( Social media )లో వినిపిస్తుంది.లేదా అంత పెద్ద కుటుంబానికి కోడలు అయ్యాక ఆమెకు అవకాశం ఇవ్వాలంటే తమ సినిమాలో లేదా వెబ్ సిరీస్ లో ఒక మేటర్ ఉండాలి అని మేకప్ అనుకుంటున్నారా అనే సందేహం కూడా వస్తుంది.ఇంతకుముందు అంటే ఆమె ఒక హీరోయిన్ కానీ ఇప్పుడు చిరంజీవి కుటుంబానికి కోడలు మెగా హీరో వరుణ్ తేజ్ కి భార్య.
ఏది పడితే అది ఇచ్చి ఆమె స్థాయిని తగ్గించడం కూడా భావ్యం కాదు అని భావిస్తున్నారని కూడా అనుకోవచ్చు.
![Telugu Chiranjeevi, Megafanily, Mister, Naga Babu, Ott Project, Tollywood, Varun Telugu Chiranjeevi, Megafanily, Mister, Naga Babu, Ott Project, Tollywood, Varun](https://telugustop.com/wp-content/uploads/2024/01/varun-tej-tollywood-OTT-project-naga-babu-chiranjeevi-megafanily-mister-movie.jpg)
ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ ఇంటి నుంచి కోడల్లు ఎవరు సినిమా రంగంలోకి అడుగు పెట్టలేదు.అతి కష్టం మీద నాగబాబు కూతురు నిహారిక ఇండస్ట్రీకి వచ్చిన ఆమె కూడా సక్సెస్ కాలేదు.ఇక పవన్ కళ్యాణ్ భార్య మాజీ రేణు దేశాయ్ సైతం అతనిని పెళ్లి చేసుకోగానే కెరియర్ ను పక్కన పెట్టింది.
ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ప్రస్తుతానికి ఎవరూ లేరని చెప్పాలి.మరి లావణ్య త్రిపాఠి కూడా వారి దోవలోనే నడిచి సినిమా ఇండస్ట్రీకి దూరమవుతుందా? లేదంటే ఇంకా వేరే హీరోలతో రొమాన్స్ చేసే అవకాశం ఉందా అనేది మాత్రం కొన్ని రోజులు ఆగి చూస్తే తెలుస్తుంది.