లతా మంగేష్కర్ తెలుగులో ఎన్ని పాటలు పాడారో తెలుసా.. మొత్తం ఎన్నంటే..

ఏడూ దశాబ్దాలకు పైగా తన పాటలతో యావత్ భారత దేశాన్ని అలరించిన గానకోకిల లతా మంగేష్కర్.ఈమె తన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను ఉర్రూత లూగించారు.

 Lata Mangeshkar Total Telugu Songs, Lata Mangeshkar, Telugu Songs,lata Mangeshka-TeluguStop.com

సెప్టెంబర్ 28కి ఆమె 91 వ ఏట అడుగు పెడుతున్నారు.లతా మంగేష్కర్ గాత్రం అమృతంలా ఉంటుంది.

తన కెరీర్ లో లతా మంగేష్కర్ 20 భారతీయ భాషల్లో దాదాపు 26వేలకు పైగా పాటలు పాడారు.

లతా మంగేష్కర్ దాదాపు భారతీయ అన్ని భాషల్లో పాటలు పాడారు.

ఈమెతో పాటలు పాడించుకోని సంగీత దర్శకులు లేరు అంటే నమ్మాల్సిందే.ఈమె ఎక్కువగా హిందీ పాటలే పాడారు.

అయితే తెలుగులో ఎన్ని పాటలు పాడారో మీకు తెలుసా.ఈమె మిగతా భాషల్లో కంటే తెలుగులో చాలా తక్కువ పాటలే పాడారని చెప్పాలి.

ఈమె తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ పాటలు పాడక పోవడం మన దురదృష్టం.

లతా మంగేష్కర్ తెలుగు లో కేవలం మూడు పాటలు మాత్రమే పాడారు.అయితే తెలుగులో ఇంత తక్కువ పాటలు పాడడానికి కారణం మాత్రం తెలియదు.1955లో ఏఎన్నార్, సావిత్రి నటించగా.సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించిన సంతాపం సినిమాలో నిదురపోరా తమ్ముడా అనే పాట లతా మంగేష్కర్ తొలి పాట.తర్వాత 1965ల ఎన్టీఆర్, జమున నటించిన సాలూరి రాజేశ్వరరావు కంపోజ్ చేసిన దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వెంకటేశా అనే పాటను ఆలపించారు.చివరిగా మూడవ పాట నాగార్జున, శ్రీదేవి జంటగా 1988లో వచ్చిన ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీరకు పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం తో కలిసి ఆలపించారు.ఇలా లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాటలు ఈ మూడే.

ఈమె మరణంతో సంగీత ప్రపంచంలో మరొక శకం ముగిసింది.భారతీయ సినీ నేపధ్య సంగీతానికి చిరునామా గా మారిన గానకోకిల లతా మంగేష్కర్ ఇకలేరు అనే వార్త ను ఆమె అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఆమె గొంతు ముగా బోయింది అంటే ఇప్పటికి నమ్మలేక పోతున్నారు.దాదాపు నెలరోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

Lata Mangeshkar Total Telugu Songs, Lata Mangeshkar, Telugu Songs,Lata Mangeshkar Songs, Lata Mangeshkar Telugu, Lata Mangeshkar No More, Lata Mangeshkar Death - Telugu Lata Mangeshkar, Latamangeshkar, Telugu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube