రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం.తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల నాలుగు దశల్లో ప్రతిపక్షం టీడీపీ ఆశించిన విధంగా దూకుడు చూపించిందా.
లేదా.గెలుపు ఓటములు ఎలా ఉన్నాయి.
అనే విషయాలను పక్కన పెడితే.చాలా వరకు పంచాయతీలు.
నియోజకవర్గాల్లో పార్టీలో విభేదాలు మాత్రం తెరమీదికి వచ్చాయి.ఇప్పటి వరకు చంద్రబాబును దేవుడు.
రాముడు.అంటూ కొనియాడిన నాయకులు కూడా ఇప్పుడు యూటర్న్ తీసుకుని.
చంద్రబాబుపై విరుచుకుపడు తున్నారు.మరీ ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అయితే.
తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల జరిగిన పంచాయతీ పోరులో కుప్పం పరిధిలోని 89 పంచాయతీల్లో 74 అధికార పార్టీ కైవసం చేసుకుంది.
నిజానికి ఇక్కడ టీడీపీ బలం ఎక్కువ.పైగా చంద్రబాబు అంటే సెంటిమెంటు కూడా ఎక్కువ.
అలాంటి చోట కేవలం 14మంది మాత్రమే టీడీపీ మద్దతు దారులు విజయం సాధించారు.ఈ నేపథ్యంలో అధికార పక్షం వైసీపీ నుంచి టీడీపీకి గట్టి సవాళ్లే ఎదురయ్యాయి.
చంద్రబాబు తన సొంత జిల్లాలోనే ఓడిపోయారని.పార్టీని నట్టేట ముంచుతున్నారని.
ఇలా అనేక విమర్శలు చుట్టుముట్టాయి.దీంతో రెండు రోజుల కిందట చంద్రబాబు కుప్పం నేతలతో భేటీ అయి.ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.తాను త్వరలోనే వస్తున్నానని.
పరిస్తితులపై చర్చిద్దామని అన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా భేటీ అయిన కుప్పం తమ్ముళ్లు.స్థానికంలో ఎందుకు ఓడిపోయామో.చర్చించాలని.
అనుకున్నారు.అయితే.
అనూహ్యంగా కొందరు నాయకులు ముఖ్యంగా ఓడిపోయిన నేతలు తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు.నేరుగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ.
ఆయన వల్లే తాము ఓడిపోయామని.తమకు కనీసం దిశానిర్దేశం కూడా చేసే దిక్కులేకుండా పోయిందని.
అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని.ఇలాఅనేక విమర్శలు చేయడంతోపాటు.
కుప్పం టీడీపీ ఇంచార్జ్ పీఎస్ మునిరత్నం.పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు.
దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.ఇదిలావుంటే.పార్టీలో కీలక నేత, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కూడా సైలెంట్ అయ్యారు.అసలు ఎందుకు ఇలా జరగుతోందనే విషయంపై దృష్టి పెట్టారు.
మొత్తంగా తేలిందేంటంటే.కుప్పంలోని కొందరు తమ్ముళ్లు.
అధికారపార్టీకి చెందిన కీలక నాయకుడు.మంత్రి అనుచరుల వలలో చిక్కుకుని పార్టీలో కోవర్టుగా ఉండి.
నాశనం చేస్తున్నారని తేలింది.దీనిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.
రెండు రోజుల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.