నాగార్జున సాగర్ స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ ఇల్లు ముట్టడి… ఉద్యోగాల నోటికేషన్ విడుదల చేయనందుకు,నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు నిరసనగా హలియ లో MLA ఇల్లు ముట్టడి చేయడం జరిగింది.ఈ సంధర్బంగా యువజన కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు పగడాల నాగరాజు స్వరాష్ట్ర నినాదం నీళ్లు,నిధులు,నియామకాలు,ఈ నియామకాలలో భాగంగా రాష్ట్రంలో అధికారంలో వచ్చి ఏడూ సంవత్సరాలు అవుతున్న ఒక ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లేదు.
అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఎన్నికల సమయాన హామీ ఇచ్చి మూడేండ్లు అవుతున్న ఇవ్వడం లేదు.
అందుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక,అటు పెళ్లిళ్లు కాక నిరుద్యోగులు మానసికంగా క్రుంగి రోజు రోజు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని,అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
.