ప్రతి సంవత్సరం మన దేశంలో లక్షల సంఖ్యలో ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే.క్యాన్సర్ ను తొలి దశలో గుర్తిస్తే చికిత్స అందించి సులభంగా నయం చేయవచ్చు.
ఆలస్యంగా గుర్తిస్తే మాత్రం కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది.ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తల్లి క్యాన్సర్ బారిన పడ్డారు.
గతంలో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా, వింత చేష్టల ద్వారా రాఖీ సావంత్ వార్తల్లో నిలిచారు.
పదుల సంఖ్యలో సినిమాలలో నటించిన రాఖీ సావంత్ కు ఈ మధ్య కాలంలో సినిమాల్లో అవకాశాలు తగ్గాయి.
హిందీలో బిగ్ బాస్ సీజన్ 1తో పాటు సీజన్ 14లో పాల్గొన్న రాఖీ సావంత్ సీజన్ 14లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడంతో పాటు టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు.బిగ్ బాస్ ఆఫర్ చేసిన 14 లక్షల రూపాయల ఫ్రైజ్ మనీ తీసుకొని హౌస్ ను వీడిన రాఖీ సావంత్ క్యాన్సర్ బారిన పడిన తల్లి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించాలని అభిమానులను కోరారు.
రాఖీ సావంత్ తల్లి జయా సావంత్ క్యాన్సర్ బారిన పడి మహమ్మారితో పోరాడుతున్నారు.సోషల్ మీడియాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మ ఫోటోలను షేర్ చేసిన రాఖీ సావంత్ అమ్మ కోసం ప్రార్థించమని విజ్ఞప్తి చేశారు.
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత ఎంత కష్టమైనా భరించి తల్లిని కాపాడుకుందామంటూ భావోద్వేగానికి గురయ్యారు.బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బులను క్యాన్సర్ చికిత్స కోసం వినియోగిస్తానని పేర్కొన్నారు.

బిగ్ బాస్ హోస్ట్ అయిన సల్మాన్ ఖాన్ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ సల్మాన్ ఖాన్ తమకు దేవుడు ఇచ్చిన అన్నయ్య అని.ఆయన రాజులకు రాజు అని సల్మాన్ కు ప్రపంచంలో ఉండే అన్ని సంతోషాలు దక్కాలని తాను కోరుకుంటున్నానని రాఖీ సావంత్ తెలిపారు.