కామ ప్రిన్సిపాల్.. పాఠాలు చెప్పవలసిన పంతుళ్లకు ఇదేం పోయేకాలం.. ?

సమాజంలో రాను రానూ ఆడవారిపట్ల చిన్న చూపు ఏర్పడుతుందని అనుకోవడంలో అబద్ధం లేదనిపిస్తుంది.మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నప్పటికి వారికి ఇవ్వ వలసిన గౌరవాన్ని ఇవ్వడం ఈ సమాజం ఎప్పుడో మరచిపోయింది.

 Keechaka Principal In Colleg Andhra Pradesh, West Godavari, Thadepalligudem, Ba-TeluguStop.com

ఎందుకంటే అడుగడుగున ముసుగు వేసుకున్న తోడేళ్లూ ఆవురావురు మంటూ ఆకలిగొన్నట్లుగా మాటు వేస్తున్నాయి.ఏ మాత్రం చిక్కిన అమ్మాయిల జీవితాన్ని కామ కొరలకు బలి చేస్తున్నాయి.

ఇక దైవంతో సమానం అయిన గురువులు కూడా గుడ్డివారిగా మారి విద్యార్ధినుల పొందుకోసం కుక్కల వలే చొంగ కార్చుకుంటూ వెకిలి చేష్టలకు పాల్పడటం నిత్యం ఏదో ఒక వార్త రూపంలో వెలుగులోకి వస్తుంది.తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ కళాశాలలో జరిగింది.

దొంగతనంగా కాలేజ్ డేటా బేస్ నుండి స్టూడెంట్స్ నెంబర్లు తీసుకున్న ప్రిన్సిపల్ మొదట సబ్జెక్ట్ పేరుతో చాట్ చేస్తూ, చివరకు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడట.ఇలా ఆ కీచకుడి చేతిలో చాలా మంది యువతులు వేధింపులకు గురైనట్లు స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు.

అయితే ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న ఓ యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రుల సహాయంతో బయటకు తీసుకువచ్చింది.దీంతో ఆ కామాంధుడు కాళ్లబేరానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఇక చివరకు ఈ మ్యాటర్ పోలీసుల వద్దకు చేరడంతో అతన్ని విచారిస్తున్నట్లుగా సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube