ఆర్థిక చట్టం 2021 సవరణలో భాగంగా సౌదీ, యూఏఈ, ఒమన్, తదితర గల్ఫ్ దేశాల్లో పనిచేసే ప్రవాస భారతీయుల జీతభత్యాల పై అదనపు పన్ను లేదా కొత్తగా ఓ ప్రత్యేక పన్ను ప్రవేశపెట్టారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహుమోయిత్రా ట్వీట్ చేశారు.నిర్మలా సీతారామన్ తన మాట తప్పారని కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు.
దీంతో ఈ ట్వీట్ పై స్పందించిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇతర దేశాలకు వెళ్లి కష్టపడి పనిచేస్తున్న కార్మికుల పై తాము ఎటువంటి అదనపు పన్ను విధించలేదని గురువారం రోజు క్లారిటీ ఇచ్చారు.
‘‘మాట ఇచ్చిన వాటిపై మేము వెనక్కి తగ్గడం లేదు.
గల్ఫ్ దేశాల్లో భారత ఎన్‌ఆర్‌ఐ కార్మికులు సంపాదిస్తున్న జీవితాలపై పన్ను విషయంలో ఎలాంటి మార్పు తీసుకు రాలేదు.వారి జీతభత్యాల పై ఇప్పటికీ భారతదేశంలో పన్ను మినహాయింపు కొనసాగుతుంది.
ఆర్థిక చట్టం 2021 సవరణలో భాగంగా సౌదీ, యూఏఈ, ఒమన్, ఖతార్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులపై ఎటువంటి అదనపు లేదా కొత్త పన్ను విధించలేదు.ఆదాయ పన్ను చట్టంలో స్పష్టత కోసం “పన్నుకు బాధ్యులు” అన్న నిర్వచనాన్ని బిల్లులో పేర్కొన్నాం” అని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.
నిజానిజాలు ఏంటో కూడా తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వారి భయాందోళనలకు కొందరు మంత్రులు కారణం అవుతున్నారని ఆమె మండిపడ్డారు.భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఏ మూలన పనిచేసినా వారి జీవితాలపై ఎటువంటి పన్ను ప్రవేశ పెట్టే ప్రసక్తే లేదని నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి నెలలో చెప్పుకొచ్చారు.కేవలం భారత దేశంలో పనిచేసే భారతదేశం లోనే డబ్బు సంపాదించే ఉద్యోగులపై మాత్రమే పన్ను భారం ఉంటుందని ఆమె క్లారిటీ ఇచ్చారు.దీంతో ఇదే విషయాన్ని ఉటంకిస్తూ ఆ రోజు అలా చెప్పారు కానీ ఆర్థిక చట్టం 2021 సవరణలో అర్థంకాని పదాలను వాడి ఎన్నారైల పై అదనపు పన్ను ప్రవేశ పెట్టారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ చేశారు.
దీంతో నిర్మలాసీతారామన్ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.