ఇదేం షేక్‌రా నాయ‌నా ? చూస్తుంటేనే పిచ్చిలేస్తోంది ? వీడియో వైర‌ల్ !

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని స‌రికొత్త వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.విచిత్ర వంట‌కాల వీడియోలు చూసి ఆహార ప్రియులే వామ్మో అంటున్నారు.

 Is This Shek Looking Crazy Video Goes Viral!, Viral Video Viral, Instagram Po-TeluguStop.com

రోజు చేసే వంట‌కాల‌కు భిన్నంగా కొత్త వంట‌లు ట్రై చేస్తున్నారు.ఇటీవ‌ల చాక్లెట్ స‌మోసా.

ట‌మోటా క‌చోరి.ఐస్‌క్రీం క‌చోరి, పుచ్చ‌కాయ మిల్క్ షేక్‌.

ఇలా అనేకం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం విధిత‌మే.ఈక్ర‌మంలో తాజాగా ఓ కొత్త వంట‌కం నెట్టింటిలో వైర‌ల్ అవుతోంది.

ఇది చూసిన పానీపూరీ ప్రియులు ఇదేం షేక్ రా నాయ‌నా అంటూ త‌ల‌లు ప‌ట్టు కుంటున్నారు.ఇక్క డ విచిత్రం ఏమిటంటే.

గొల్గ‌ప్పా షేక్‌(పానీపూరీ షేక్‌) కావ‌డం.వీడియో చూసిన‌పుడు దీనిని త‌యారు చేయ‌డం ఈజీ అనిపిస్తుంది.

ఇందుకు ఎక్క‌డికో వెళ్లాల్సిన ప‌ని లేదు.ఇంటిలోనే సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు.

కానీ, రుచి కోసం ట్రై చేస్తేనే అస‌లు విష‌యం తెలుస్తుంది.కానీ వీడియోలో విచిత్ర షేక్ చూసి వాంతుల‌వుతున్నాయ‌నే కామెంట్లు పెడుతున్నారు.

అనేక ర‌కాల వంట‌కాలు చూశాం.తిన్నాం.

కానీ, ఇలాంటివి చూడ‌లేదు.ఇదేం పోయే కాలంరా దేవుడా అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియోలో ఓ వ్య‌క్తి  గోల్గ‌ప్ప షేక్ త‌యారు చేస్తున్నాడు.ఫ‌స్ట్ అత‌ను మిక్స‌ర్‌లో రెండు గొల్గ‌ప్ప‌ను వేసి త‌రువాత ఉడికించిన బంగాళ దుప‌లు, రెడ్ చ‌ట్నీ, పుల్ల‌ని నీరు కలుపుతాడు.

అనంత‌రం కొద్దిగా ఐస్ వేసి మిక్స‌ర్‌లో వేసి మిక్స్ చేస్తాడు.

త‌దుప‌రి ఒక గ్లాసులో దానిని పోలిస గొల్ల‌గ‌ప్ప పొడి వేస్తాడు.చివ‌ర‌గా ఉడికించిన బంగాళ దుంప‌ల‌తో అలంక‌రిస్తాడు.ఈ వీడియో చూస్తున్నంత సేపు వాంతులు అవుతున్న ఫీలింగ్ వ‌స్తుంద‌ని నెటిజ‌న్లు తిట్టిపోస్తున్నారు.

ఏదైనా వంట‌కం అంటే ఓ ప‌ద్ధ‌తి అంటూ ఉంటుంది.కానీ, ఇక్క‌డ ఏంచేస్తున్నాడు ? ఇది తింటే ఇంకేమైనా ఉందా ? అనే అనుమానం రాక మాన‌దు.అందుకే ఈ విచిత్ర వంట‌కం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube