ఏపీలో టిడిపి ,జనసేన ,బిజెపిలు ( TDP, Janasena, BJP ) పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతున్నాయి.ఈ ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు ముందుకు వెళుతున్నాయి.
టిడిపి, బిజెపిలతో పొత్తు కారణంగా జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను మాత్రమే తీసుకుంది.అయితే కనీసం 50 స్థానాలైనా జనసేనకు పొత్తుల భాగంగా టిడిపి కేటాయిస్తుందని ఆ పార్టీ నాయకులు భావించినా, అది సాధ్యం కాలేదు.
దీంతో జనసేన లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ,మొదటి నుంచి నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న నాయకులకు ఈ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు.అలాగే చివరి నిమిషంలో టిడిపి నుంచి జనసేన లో చేరిన వారికి ఎక్కువ సీట్లు కేటాయించడం ,తదితర వ్యవహారాలపై ఆ పార్టీ నాయకులు కొంతమంది అసంతృప్తికి గురై ఇప్పటికే పార్టీ మారగా , మరి కొంత మంది అదే బాటలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
సీట్ల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఎక్కువగా ఉంది.ఈ అసంతృప్తితోనే చాలామంది నాయకులు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు.ఇపటికే అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పరుచూరి భాస్కరరావు( Incharge Paruchuri Bhaskara Rao ) పార్టీకి రాజీనామా చేశారు. జనసేన నేతల్లో కీలకంగా ఉన్న పితాని బాలకృష్ణ( pithani Balakrishna ) కూడా పార్టీ కి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
తాజాగా మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.కాకినాడ సిటీ జనసేన ఇన్చార్జిగా ఉన్న ముత్తా శశిధర్ ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారట.2019 ఎన్నికల్లో కాకినాడ సిటీ నుంచి శశిధర్ పోటీ చేసి ఓటమి చెందారు.
గతంలో కాకినాడలో పవన్ పర్యటించిన సమయంలో కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానాన్ని శశిధర్ కు కేటాయిస్తామని హామీ ఇచ్చారు .కానీ పొత్తు లో భాగంగా ఆ సీటు ను ఇప్పుడు టిడిపికి కేటాయించడంతో, ముత్తా శశిధర్ అసంతృప్తితో ఉన్నారు.ఈ నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం .ఇప్పటికే పవన్ పీఠాపురం పర్యటనకు శశిధర్ దూరంగానే ఉన్నారు.ఒకటి రెండు రోజుల్లో రాజీనామా చేసేందుకు శశిధర్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.