రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఐదారు స్థానాల్లో పోటీ చేసి తమ ఉనికిని చాటుకోవాలనే ఆశతో ఉన్న వామపక్ష పార్టీలైన సిపిఐ , సీపీఎంల( ( Cpi cpm ) ఆశ తీరేటట్టు కనిపించడం లేదు.మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీ బీఆర్ఎస్ కు మద్దతు పలకడంతో ఆ పొత్తు అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందని వామపక్ష నేతలు ఆశపడ్డారు.
కేసీఆర్( CM kcr ) సైతం ఆ విధమైన సంకేతాలు ఇవ్వడంతో ఆ రెండు పార్టీల నేతల్లో కనిపించింది.అయితే బీఆర్ ఎస్ అభ్యర్థుల జాబితాను కెసిఆర్ అకస్మాత్తుగా ప్రకటించడంతో పార్టీల నేతలు కనసం ఒక్క మాట కూడా చెప్పకుండా అభ్యర్థులను ఖరారు చేయడం ఏమిటని ఫైర్ అయ్యారు.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సైతం వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేసినా, ఆ పార్టీని దూరం పెట్టడమే కాకుండా అనేక విమర్శలు చేశారు.
కానీ చివరకు కాంగ్రెస్ తో ( Congress )పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు .అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది .ఈ నేపథ్యంలో వామ పక్ష పార్టీలు కొన్ని కీలక నియోజకవర్గలను కేటాయించాల్సిందిగా కాంగ్రెస్ పై ఒత్తిడి చేస్తున్నాయి .అయితే అక్కడ కాంగ్రెస్ కి కూడా బలం ఉండడం తో వామపక్ష పార్టీలకు సీట్లు కేటాయించలేని పరిస్థితి కనిపించడం లేదు.
నల్గొండ , భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులకు మంచి ఓటు బ్యాంకు ఉందని, పొత్తులు పెట్టుకుంటే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ లోనూ కొంతమంది భావిస్తున్నారు.అక్కడ సీట్లు ఆశిస్తున్న వారు రెబెల్ గా మారుతారని , అది కాంగ్రెస్ కే నష్టం చేకూర్చుతుంది అనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి.దీంతో వామపక్ష పార్టీలకు కాంగ్రెస్ సీట్లు( Congress ) కేటాయించే అవకాశం కనిపించడం లేదు.
దీంతో సిపిఐ , సిపిఎం ( Cpi cpm )ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.