ఐపీఎల్( IPL ) అనేది ఆటగాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకునే ఒక మంచి ప్లాట్ ఫామ్.అంతర్జాతీయ స్థాయిలో ఆడడానికి, దేశ జట్లలో స్థానం దక్కించుకోవడానికి ఐపీఎల్ ఒక మంచి ప్లాట్ ఫామ్.
చాలామంది ఆటగాళ్లు ఐపీఎల్ లో తమ సత్తా చాటుతుంటే.మరి కొంతమంది ఘోరంగా ప్లాప్ అవుతున్నారు.
కొందరు ఆటగాళ్లు తమ జట్టులో ఉంటే విజయం తథ్యం అని భావించిన ఫ్రాంచైజీలు కోట్లకు కోట్లు వేచించి సొంతం చేసుకుంటే.గ్రౌండ్లో మాత్రం కొత్త ప్లేయర్ల కంటే దారుణంగా అట్టర్ ప్లాప్ అయిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
సికిందర్ రజా:
జింబాబ్వే కు చెందిన ఆల్ రౌండర్ ఆటగాడు.గతేడాది టీ20 ప్రపంచ కప్ లో చాలా అద్భుతంగా ఆడి జట్టును గెలిపించడంలో కీలక ఆటగాడిగా నిలిచాడు.ఇంత అద్భుత ఆటగాడిని ఎలాగైనా దక్కించుకోవాలని పంజాబ్ కింగ్స్ రూ.50 లక్షల బేస్ ప్రైస్ ఇచ్చి జట్టులోకి చేర్చుకుంది.సికిందర్ రజా( Sikindar Raja ) పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన 3 మ్యాచ్లలో 7.33 సగటు, 104.76 స్ట్రైక్ రేట్ తో కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు.ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆడిన మూడు మ్యాచ్లలో కేవలం ఒక వికెట్ తీశాడు.ఇతని ఎకనామీ రేటు 9.80 గా ఉంది.ఇప్పటివరకు చెప్పుకోదగ్గ మంచి ప్రదర్శన చేయలేదు.

హ్యారీ బ్రూక్:
ఇంగ్లాండ్ కు చెందిన ఈ ఆటగాడిని హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.13.25 కోట్లు చెల్లించి తమ జట్టులో చేర్చుకుంది.ఇతను కూడా ఆడిన మూడు మ్యాచ్లలో 9.67 సగటు, 74.36 స్ట్రైక్ రేట్ తో కేవలం 29 పరుగులు చేశాడు.

కామెరాన్ గ్రీన్:
ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆటగాడిని ముంబై ఫ్రాంచైజీ( Mumbai Indians ) రూ.17.50 కోట్లు వేచించి జట్టులోకి తీసుకుంది.ఇతను కూడా ఆడిన రెండు మ్యాచ్లలో 8.50 సగటు, 113.33 స్ట్రైక్ రేట్ తో 17 పరుగులు చేశాడు.ఇక బౌలింగ్ విషయానికి వస్తే రెండు మ్యాచ్లకు కలిపి ఒక వికెట్ తీశాడు.
ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో ఆట ప్రదర్శన చేయలేక నిరాశ పరిచారు.ఫ్రాంచైజీల ఆశలను గల్లంతు చేశారు.తర్వాత మ్యాచ్లలో ఎలా ఆడతారో చూడాలి.