ఒకపక్క తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడు ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది .మూడోసారి బీఆర్ఎస్( BRS ) ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కెసిఆర్( KCR ) గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి బీ ఆర్ ఎస్ కు అవకాశం దొరకకుండా చేయాలని బిజెపి , కాంగ్రెస్ లు విడివిడిగా పోరాటాలు , పాదయాత్రలు వంటివి చేపడుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో… కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు తీరిక లేని పరిస్థితి.
అయినా వచ్చే నెలలో కర్ణాటకలో (Karnataka )జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని తాజాగా కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.అక్కడ జరగబోతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు దారుగా ఉన్న జెడిఎస్ కు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.

కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో కేసిఆర్ అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.కెసిఆర్ తో పాటు తెలంగాణ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఇతర కీలక నాయకులు, కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ఇదే విషయాన్ని జెడిఎస్ అధినేత కుమారస్వామి ( Kumaraswamy )వెల్లడించారు.
ఈసారి జరగబోయే ఎన్నికల్లో 59 స్థానాలను గెలుచుకుని ముఖ్యమంత్రి అవుతాననే ధీమా లో కుమారస్వామి ఉన్నారు.

ఒంటరిగా అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం జేడీఎస్ కు ఉండదనే అంచనా ఉండడంతో, కాంగ్రెస్, బిజెపిలలో ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అనేది రానున్న రోజుల్లో తేలనుంది.ఇప్పటికే 97 మంది అభ్యర్థులను కుమారస్వామి ప్రకటించగా, కాంగ్రెస్ 165 మంది పేర్లను ప్రకటించింది .ఇక బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది .కర్ణాటక ఎన్నికలలో తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కెసిఆర్ తో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని ఎన్నికల ప్రచారానికి వెళ్లి జేడిఎస్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నారు.