2022 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఆర్ఆర్ఆర్ మూవీ ఒకటిగా నిలిచిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సినిమాలో చరణ్ ఎంట్రీ సీన్ కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి.ఈ సీన్ రామ్ చరణ్ సినీ కెరీర్ లోని బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్లలో ఒకటని కామెంట్లు వినిపించాయి.
ఎక్కువ నిడివితోనే ఉన్న ఈ సీన్ ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందనే సంగతి తెలిసిందే.
అయితే ఈ సీన్ ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి మూవీ నుంచి జక్కన్న స్పూర్తి పొందారని కొంతమంది కామెంట్ చేస్తుండగా ఈ సీన్ ను రాజమౌళి కాపీ కొట్టారని మరి కొందరు కామెంట్ చేస్తుండటం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలలో ఊసరవెల్లి సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
ఊసరవెల్లి ఫ్లాష్ బ్యాక్ లోని ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ను చూస్తే మాత్రం ఆర్ఆర్ఆర్ మూవీలోని రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ గుర్తుకు రావడం గ్యారంటీ అని చెప్పవచ్చు.ఈ సీన్ లో టోని పాత్రలో తారక్ ఒక్కడే వంద మందితో ఫైట్ చేస్తాడు.
ఊసరవెల్లి సినిమాకు హైలెట్ సీన్లలో ఈ సీన్ ఒకటిగా నిలిచింది.అయితే ఈ కామెంట్ల విషయంలో జక్కన్న ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
రాజమౌళి సినిమాలలో ప్రతి సినిమాకు కాపీ మరకలు సాధారణం అనే సంగతి తెలిసిందే.జక్కన్న సైతం పలు సందర్భాలలో తాను తనకు నచ్చిన సినిమాల నుంచి స్పూర్తి పొందుతానని చెప్పుకొచ్చారు.మరోవైపు రాజమౌళి తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది.ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.