స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో లక్ష్మీ నరసింహ సినిమా కూడా ఒకటి.జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.
బాలకృష్ణకు జోడీగా ఈ సినిమాలో అసిన్ హీరోయిన్ గా నటించారు.తమిళంలో హిట్టైన సామి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా విడుదల కావడం గమనార్హం.
నరసింహ నాయుడు తర్వాత సరైన హిట్ లేని బాలయ్యకు ఈ సినిమా ద్వారా బాలయ్యకు సక్సెస్ దక్కింది.
సామి రీమేక్ ను చూసిన బాలయ్య ఈ సినిమా రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తమిళంలో హిట్టైన సామి సినిమాకు కొన్ని కీలక మార్పులు చేసి తెలుగులో ఈ సినిమాను విడుదల చేశారు.ఈ సినిమాకు అప్పట్లోనే దాదాపు 12 కోట్ల రూపాయలు ఖర్చైందని సమాచారం.
450 థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగకూడదని అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం 144 సెక్షన్ ను అమలు చేసింది.
లంచం తీసుకునే పోలీస్ ఆఫీసర్ కథతో ఈ సినిమా తెరకెక్కింది.
సినిమాలో ఉండే కొన్ని సీన్లు ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉన్నాయి.ఈ సినిమాలో బాలయ్య లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
మణిశర్మ పాటలు, కృష్ణభగవాన్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్లస్ అయింది.ఈ సినిమాకు పోటీగా వర్షం సినిమా రిలీజ్ కాగా వర్షం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది.

ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావించినా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఫుల్ రన్ లో నష్టపోయింది.తొలివారం ఈ సినిమాకు ఏకంగా 10 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.బాలయ్య అభిమానులకు ఎంతగానో నచ్చిన సినిమాలలో లక్ష్మీ నరసింహ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.