బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమపక్షులుగా ఉంటూ ప్రేమలో విహరించిన ప్రేమ జంట రణబీర్ కపూర్ అలియా భట్ గత నెల పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇకపోతే వీరిద్దరు జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా త్వరలోనే విడుదల కానుంది.ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కపూర్ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా రణబీర్ కపూర్ మాట్లాడుతూ మాకు పెళ్లి జరిగినా కూడా పెద్దగా తేడా ఏమీ కనిపించలేదని ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్ చేశారు.
పెళ్లి అయిన మరుక్షణమే సినిమా షూటింగులకు వెళ్లడంతో అసలు మాకు పెళ్ళి జరిగింది అనే విషయం కూడా మర్చిపోయామని, ఈ సందర్భంగా రణబీర్ పెళ్ళి పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక పెళ్లికి ముందు ఐదు సంవత్సరాలపాటు మేము ప్రేమలో కలిసి ఉండటం వల్ల మాకు పెళ్లి అయిందన్న ఫీలింగ్ రాలేదని, పెళ్లి జరగగానే హమ్మయ్య పెళ్లి అయిపోయింది అనే ఫీలింగ్ తప్ప పెద్ద తేడా ఏమీ లేదు అంటూ ఈ సందర్భంగా రణబీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇక పెళ్ళి జరిగిన మరుసటి రోజే రణబీర్ యానిమల్ సినిమా షూటింగ్ లో పాల్గొనగా, అలియా సైతం తన సినిమా షూటింగులతో బిజీ అయ్యారు.ఇక వీరిద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా త్వరలోనే విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ కొత్త జంట తమ కోసం కాస్త సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది.