దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా విరాటపర్వం.ఈ సినిమాను ఎస్.
ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మించారు.కామ్రెడ్ రవన్న జీవిత కథ స్పూర్తితో వస్తున్న ఈ సినిమా జూన్ 17న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే సినిమా సెలబ్రిటీస్ కోసం ప్రీమియర్స్ వేయగా అక్కడ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఇప్పటికే సూపర్ ప్రమోషన్స్ తో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నారు.ఈ క్రమంలో రానా విరాటపర్వం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 15న హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.
ఆల్రెడీ సినిమాకు ఇప్పటికే రెండు ఈవెంట్ లు నిర్వహించారు.ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు.
విరాటపర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి అటెండ్ అవుతున్నారు.వీరితో పాటుగా స్టార్ డైరక్టర్ సుకుమార్ కూడా చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు.
విరాటపర్వం సినిమా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు.