నిమ్మకాయతో క్లీనింగ్ సోప్ చేయడం ఎలా ?

నిమ్మకాయ వలన ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు పాత్రల ఆరోగ్యం కూడా ఇంటి ఆరోగ్యం కూడా కాపాడుతుంది.అదేనండి పాత్రలు సుభ్రపరచడానికి ఇంటి క్లీనింగ్ కి కూడా నిమ్మ ఉపయోగపడుతుంది.

 Lemon For House Cleaning-TeluguStop.com

నిమ్మ రసానికి ఉన్న శక్తి ఎలాంటిదో మీరు చుడండి.

ఇంట్లో కొన్ని పాత్రలకి పట్టే మురికి పోవాలంటే ఎంతో కష్టపడాలి.

కానీ ఎంతో సునాయాసంగా అలాంటి మరకలు పోవాలంటే నిమ్మ చెక్క బాగా ఉపయోగపడుతుంది.ఇంట్లో కిటీకిల, షింక్ లలో దుమ్ము పేరుకపోతుంది.

దీనిని తొలగించాలంటే ఓ మగ్గు నీళ్లలో నిమ్మరసం వేసి అందులో కొంచం బేకింగ్ సోడా వేయాలి.కాటన్ బట్టను నీళ్లలో ముంచి కిటీకి , తలుపులు , షింక్ లను తుడిచి చూడండి.

రిజల్ట్ మీకే తెలుస్తుంది.

ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ వంటకాలు వండిన తరువాత గిన్నెలు కడుగలేక అవస్థలు పడుతుంటారు.

పాత్రలకు ఉండే జిడ్డు, వాసన ఒక పట్టాన పోదు.అందుకు నిమ్మరసం.వెనిగర్ కలిపిన నీటితో పాత్రలను ముందుగా రుద్దాలి.అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

అంతే జిడ్డుతో పాటు వాసన పోతుంది.

నిమ్మలో ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టే టీవీ లలో వచ్చే యాడ్స్ లో గిన్నెలు తోమడానికి ఉపయోగించే సబ్బుల మీద నిమ్మకాయ బొమ్మ వేస్తారు.

మనం ఎంతో కరీదు పెట్టి కొనుక్కునే బదులు ఇలాంటి చిట్కాలు పాటిస్తే చాలు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube