ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది.ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రిలోనే వదిలి వెళ్లారు తల్లిదండ్రులు.
ఈ క్రమంలోనే పసిపాపకు జాండీస్ రావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆస్పత్రి సిబ్బంది సమాచారం అందించారు.
దీంతో ఆస్పత్రికి చేరుకున్న అధికారులు చిన్నారి బాగోగులను చూసుకుంటున్నారు.కాగా పాపను ఆస్పత్రిలో ఊయలలో వదిలేసి వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు.
మరోవైపు పాప తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.