ఆకట్టుకుంటున్న మెగా అల్లుడు 'సూపర్ మచ్చి' టీజర్..!

సినిమా ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

 Impressive Mega Hero Kalyan Dev Suepr Machhi Teaser Released, Mega Hero, Super M-TeluguStop.com

విజేత సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే కళ్యాణ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “సూపర్ మచ్చి”.

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై, రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతుంది అయితే దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఎస్.ఎస్ తమన్ అందించిన సంగీత బాణీలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు.

ప్రస్తుతం సినిమా నుంచి విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టీజర్ చూస్తే మాత్రం లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.కళ్యాణ్ దేవ్ సరసన రచిత రామ్, రియా చక్రవర్తి నటిస్తున్నారు.లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ ఎంతో అద్భుతంగా వచ్చిందని చెప్పవచ్చు.ఇందులో రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి కీలక పాత్రలో నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube